Sharukh Khan: 200 కోట్ల బడ్జట్ ని రిలీజ్ కి ముందే రికవర్ చేసేసాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టి బాయ్ కాట్ ట్రెండ్ కి, బాలీవుడ్ బాక్సాఫీస్ స్లంప్ ని ఎండ్ కార్డ్ వేసాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. జనవరి 25న సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్, హిందీ సినిమాకి ప్రాణం పోసాడు. ఇప్పుడు సెప్టెంబర్ 7న మరో బాక్సాఫీస్ సెన్సేషన్ ని ఆడియన్స్ ముందుకి తీసుకోని రాబోతున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేసిన జవాన్ సినిమా షారుఖ్ కే కాదు బాలీవుడ్ కే బిగ్గెస్ట్ హిట్ అవుతుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉంది. అనౌన్స్మెంట్ నుంచే హైప్ మైంటైన్ చేస్తున్న జవాన్ మూవీ, రీసెంట్ గా ప్రీవ్యూతో అందరికీ మైండ్ బ్లాక్ చేసింది. గుండు గెటప్ లో షారుఖ్ చేసిన హంగామా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. రిలీజ్ అయిన 24 గంటల్లో జవాన్ ప్రీవ్యూ 112 మిలియన్ వ్యూస్ రాబట్టింది అంటే ఆ వీడియో సృష్టించిన హవోక్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. యాక్షన్ ప్యాక్డ్ ప్రీవ్యూ షారుఖ్ ఫాన్స్ కి మాత్రమే కాదు ప్రతి యాక్షన్ మూవీ లవర్ కి కిక్ ఇచ్చింది.
అనిరుద్ మ్యూజిక్ ప్రీవ్యూని మరింత స్పెషల్ గా మార్చింది. చాలా రేర్ గా షారుఖ్ నెగటివ్ టచ్ ఉన్న రోల్ ప్లే చేస్తాడు, ఒకసారి ప్లే చేస్తే మాత్రం దాని ఇంపాక్ట్ బాక్సాఫీస్ దగ్గర బాగా బలంగా ఉంటుంది. ఈ విషయాన్నే జవాన్ ప్రీవ్యూ మరోసారి నిరూపించింది. జవాన్ రిలీజ్ కి ఇంకా రెండు నెలల సమయం ఉండగానే బెంచ్ ప్రాఫిట్ ని మేకర్స్ సొంతం చేసుకున్నారు అంటే షారుఖ్ ర్యాంపేజ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 200 కోట్ల బడ్జట్ తో రూపొందిన జవాన్ సినిమా ఆడియో రైట్స్, థియేటర్ రైట్స్, సాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ రూపంలో ఇప్పటికే 564 కోట్లని రాబట్టిందని సమాచారం. అంటే ఆల్మోస్ట్ 200 కోట్లతో రూపొందిన జవాన్ సినిమా రిలీజ్ కి రెండు నెలల ముందే 364 కోట్ల రూపాయలని ఎక్కువగా రికవర్ చేసింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో సినిమాకి కూడా ఈ రేంజ్ ప్రాఫిట్ రిలీజ్ కి ముందే రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. అందుకే షారుఖ్ కింగ్ ఖాన్ అయ్యాడు, బాక్సాఫీస్ కి బాద్షా అయ్యాడు.
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
తాజావార్తలు
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!