Site icon NTV Telugu

Shankar : శంకర్ కలల ప్రాజెక్ట్.. మరో దిల్ రాజు దొరుకుతాడా..?

Shankar

Shankar

Shankar : స్టార్ డైరెక్టర్ శంకర్ తన కలల ప్రాజెక్ట్ బయట పెట్టాడు. వేల్పరి బుక్ ఆధారంగా మూడు భారీ ప్రాజెక్టులు చేస్తానని.. దానికి వందల కోట్ల బడ్జెట్ అవుతుందని తెలిపాడు. అప్పట్లో రోబో తన కలల ప్రాజెక్ట్ అని.. ఇప్పుడు వేల్పరి తన కలల ప్రాజెక్ట్ అన్నాడు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ శంకర్ ను నమ్మి అన్ని కోట్ల బడ్జెట్ పెట్టే నిర్మాత ఎవరు. ఆల్రెడీ ఇండియన్-2 బిగ్ డిజాస్టర్ అయింది. ఆ మూవీ చూసిన తర్వాత దిల్ రాజుకు టెన్షన్ పెరిగింది. దిల్ రాజు అనుకున్నట్టే గేమ్ ఛేంజర్ ప్లాప్ అయింది. రాజుగారికి భారీ లాస్ ఒచ్చేసింది. అది రీసెంట్ ఇంటర్వ్యూల్లో కూడా వారే బయట పెట్టుకున్నారు. శంకర్ సినిమాలు అంటేనే భారీ బడ్జెట్ తో ఉంటాయి.

Read Also : Anasuya : దారుణంగా మోసపోయిన అనసూయ.. పోస్టు వైరల్

ముందు అనుకున్న బడ్జెట్ షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి డబుల్ అయిపోతుంది. పైగా ఏళ్లకు ఏళ్లు ఆయన సినిమాల షూటింగ్ లు సాగుతూనే ఉంటాయి. అన్నేళ్ల వరకు బడ్జెట్ పెట్టి కూర్చోవాల్సిందే. హిట్ అయితే తిరుగులేదు. ఒకవేళ ప్లాప్ అయితే మాత్రం నిర్మాత అప్పుల్లో కూరుకుపోవాల్సిందే. ఈ విషయాలు తెలిసిన తర్వాత శంకర్ కలల ప్రాజెక్టును నిర్మించే మరో దిల్ రాజు దొరుకుతాడా అన్నదే ఇక్కడ పాయింట్. అసలే శంకర్ హిట్ చూసి చాలా కాలం అవుతోంది. వేల్పరిని మూడు ప్రాజెక్టులుగా తెస్తానని అంటున్నాడు. అంటే ఒక పార్ట్ లో కథ పూర్తిగా చెప్పడం కుదరదు. అలాంటప్పుడు మొదటి పార్టు హిట్ అయినా కాకున్నా రెండో పార్టుకు వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇది నిర్మాతకు మరింత భారమే. మరి ఇంత భారాన్ని ఏ నిర్మాత మోస్తాడో చూడాలి.

Read Also : Fatima Sana : ప్రైవేట్ పార్టులు టచ్ చేశాడు.. అమీర్ ఖాన్ కూతురు కామెంట్స్

Exit mobile version