Site icon NTV Telugu

Dunki: రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన డంకీ డిజిటల్ రైట్స్

Dunki Digital Rights

Dunki Digital Rights

Shahrukh Khan Dunki Digital Rights Sold For Record Price: బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్‌కి ఎంత క్రేజ్ ఉందో మాటల్లో వర్ణించలేం. ఎన్నో పరాభవాలు ఎదురైనా.. ఐదేళ్ల గ్యాప్ తర్వాత ‘పఠాన్’ సినిమాతో అతను గత బాలీవుడ్ రికార్డులన్నింటినీ బూజు దులిపినట్టు లేపేశాడు. అందుకే, అతని తదుపరి సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం షారుఖ్ జవాన్, డంకీ సినిమాలు చేస్తున్నాడు. జవాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అయిపోయింది. కనీవినీ ఎరుగని స్థాయిలో జవాన్ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పుడు డంకీ వంతు వచ్చింది. ఈ సినిమా హక్కులు సొంతం చేసుకోవడం కోసం పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పోటీ పడుతున్నాయి.

Palak Puraswani: వాడు దారుణంగా మోసం చేశాడు.. బెడ్రూంలో నటితో శృంగారం చేస్తూ..

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇంతవరకూ ఈ సినిమాకి సంబంధించి టీజర్ గానీ, ఇతర ప్రోమోలు గానీ రాలేదు. అయినా, ఈ సినిమా హక్కుల కోసం మార్కెట్‌లో బీభత్సమైన పోటీ నెలకొంది. ఒకరికి మంచి మరొకరు భారీ ఆఫర్లు కోట్ చేస్తూ.. ఈ సినిమా రైట్స్‌ని కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. ఈ క్రమంలోనే.. జియో సినిమా రూ.150 కోట్లకు ‘డంకీ’ డిజిటల్ హక్కుల్ని కొనుగోలు చేసిందని సమాచారం. ఇది బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఫిగర్. ఎందుకంటే, ఇంతవరకు ఏ సినిమా డిజిటల్ రైట్స్ ఈ స్థాయిలో అమ్ముడుపోయిన దాఖలాలు లేవు. దీన్ని బట్టి.. ఈ సినిమాకి మార్కెట్‌లో ఏ స్థాయిలో గిరాకీ ఉందో మీరే అర్థం చేసుకోండి. మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని డిసెంబర్ 22వ తేదన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Sachin Pilot: సచిన్‌ పైలట్‌ కీలక ప్రకటన.. ఎన్నికల్లో ఐక్యంగా పోరాడేందుకు సిద్ధం

మరోవైపు.. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘జవాన్’ సినిమా చిత్రీకరణ కూడా ఇప్పటికే ముగిసిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తొలుత ఈ సినిమాను జూన్ నెలలోనే విడుదల చేయాలని అనుకున్నారు కానీ, ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కావడం వల్ల సెప్టెంబర్ 7వ తేదీన వాయిదా వేశారు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఇది ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్‌గా రూపొందుతుండటంతో.. బాలీవుడ్ ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఈ సినిమా రిలీజ్ కోసం వేచి చూస్తున్నారు.

Exit mobile version