Site icon NTV Telugu

Shahid Kapoor: నేను తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను.. అందుకే వదిలేస్తున్నా

Shahid Kapoor

Shahid Kapoor

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ప్రస్తుతం తెలుగు సినిమా జెర్సీ ని రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా ఎట్టకేలకు  ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల మందుకు రానుంది. తెలుగు సినిమాకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరినే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక  ఈ చిత్రంలో షాహిద్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇక విడుదలకు కొద్దిరోజులు మాత్రమే ఉండడంతో సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు చిత్ర బృందం. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో షాహిద్ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. షాహిద్ భార్య మీరా రాజ్ పుత్ గురించి చెప్పనవసరం లేదు. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉండే ఆమె గురించి షాహిద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. మీరా పెళ్లైన కొత్తలో తనను తప్పుగా అనుకోని వదిలి వెళ్లిపోతానని చెప్పిందని చెప్పుకొచ్చాడు. అందుకు కారణం తన నటన అని కూడా చెప్పాడు.

” ఉడ్తా పంజాబ్ చిత్రం రిలీజ్ అయ్యే సమయం..  రేపు రిలీజ్ అనగా ఈరోజు ప్రముఖులకు ప్రివ్యూ వేశారు. నేను కూడా మీరాను , నా సినిమా చూపిద్దామని తీసుకెళ్ళాను.. ఇక సినిమా మొదలైన కొద్దిసేపటికి ఆమెలో హావభావాలు మారిపోయాయి .. నా పక్కన కూర్చున్న ఆమె లేచి వెళ్ళిపోయింది.. ఆ తరువాత ఏమైంది అని నేను అడిగితె .. ఛీ నువ్ ఇలాంటివాడివి అనుకోలేదు.. నేను తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను.. వెళ్లిపోతున్నా అంటూ వెళ్ళిపోయింది. ఇక నాకు ఏమి చెప్పాలో అర్ధం కాలేదు. ఆ తరువాత తనను సముదాయించి.. అది సినిమా.. అలాగే ఉంటుంది.. అని నచ్చజెప్పడానికి చాలా కష్టపడ్డాను. ఆ ఘటనను ఇప్పటికి మర్చిపోలేను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి తెలుగులో భారీ విజయం అందుకున్న జెర్సీ హిందీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version