Shahid Kapoor: నేను తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను.. అందుకే వదిలేస్తున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ప్రస్తుతం తెలుగు సినిమా జెర్సీ ని రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 14న ప్రేక్షకుల మందుకు రానుంది. తెలుగు సినిమాకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరినే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో షాహిద్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇక విడుదలకు కొద్దిరోజులు మాత్రమే ఉండడంతో సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు చిత్ర బృందం. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో షాహిద్ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. షాహిద్ భార్య మీరా రాజ్ పుత్ గురించి చెప్పనవసరం లేదు. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉండే ఆమె గురించి షాహిద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. మీరా పెళ్లైన కొత్తలో తనను తప్పుగా అనుకోని వదిలి వెళ్లిపోతానని చెప్పిందని చెప్పుకొచ్చాడు. అందుకు కారణం తన నటన అని కూడా చెప్పాడు.
” ఉడ్తా పంజాబ్ చిత్రం రిలీజ్ అయ్యే సమయం.. రేపు రిలీజ్ అనగా ఈరోజు ప్రముఖులకు ప్రివ్యూ వేశారు. నేను కూడా మీరాను , నా సినిమా చూపిద్దామని తీసుకెళ్ళాను.. ఇక సినిమా మొదలైన కొద్దిసేపటికి ఆమెలో హావభావాలు మారిపోయాయి .. నా పక్కన కూర్చున్న ఆమె లేచి వెళ్ళిపోయింది.. ఆ తరువాత ఏమైంది అని నేను అడిగితె .. ఛీ నువ్ ఇలాంటివాడివి అనుకోలేదు.. నేను తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను.. వెళ్లిపోతున్నా అంటూ వెళ్ళిపోయింది. ఇక నాకు ఏమి చెప్పాలో అర్ధం కాలేదు. ఆ తరువాత తనను సముదాయించి.. అది సినిమా.. అలాగే ఉంటుంది.. అని నచ్చజెప్పడానికి చాలా కష్టపడ్డాను. ఆ ఘటనను ఇప్పటికి మర్చిపోలేను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి తెలుగులో భారీ విజయం అందుకున్న జెర్సీ హిందీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
- Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
- Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
- Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
- Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
తాజావార్తలు
-
KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!