Not Ramaiya Vastavaiya: ‘నాట్ రామయ్యా వస్తావయ్యా’ అంటూ రచ్చ రేపిన షారుఖ్ ఖాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shah Rukh Khans Jawan Not Ramaiya Vastavaiya song OUT NOW: కింగ్ ఖాన్ షారుఖ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘జవాన్’ హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ తో సెప్టెంబర్ 7న రిలీజ్ కి రెడీ అయింది. ఇప్పటికే ఒక రేంజ్ లో అంచనాలు ఉన్న ఈ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేలా ఈ సినిమా నుంచి మంగళవారం ‘నాట్ రామయ్యా వస్తావయ్యా’ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. రీసెంట్ గా #AskSRK సెషన్ లో షారూఖ్ తన అభిమానులతో మాట్లాడుతూ ‘నాట్ రామయ్యా వస్తావయ్యా’ సాంగ్ గ్లింప్స్ ను విడుదల చేసి ఆశ్చర్యంలో ముంచెత్తగా ఈ మూడో సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూడసాగారు. ఎట్టకేలకు ఈ నిరీక్షణకు తెర దించుతూ’నాట్ రామయ్యా వస్తావయ్యా..’ సాంగ్ విడుదల చేశారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు ‘నాట్ వస్తావయ్యా’ను అద్భుతంగా తెరకెక్కించినట్టు అనిపిస్తోంది, ఈ పాట చూస్తుంటే పార్టీ నెంబర్ లా ఉంది.
Vijay Devarakonda: ఆహా.. కొండన్న చేతిలో చెయ్యేసింది ఆమెనే.. ?
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ప్రోమోలో షారూఖ్ ఎనర్జీ, ఛార్మ్ అందరినీ ఆకట్టుకోగా సాంగ్ లో అది రెట్టింపుగా కనిపిస్తుంది. డాన్స్ మూవ్స్ ట్రెండ్ సెట్టింగ్ గా ఉన్నాయని చెప్పక తప్పదు. ఈ పాటను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో మేకర్స్ విడుదల చేయగా అన్ని లాంగ్వేజస్ లో ఈ సాంగ్ పార్టీ వైబ్స్ తో అలరిస్తుంది. ఇక హిందీ వెర్షన్ లో ‘నాట్ రామయ్యా వస్తావయ్యా’ పాటకు అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించగా కుమార్ సాహిత్యాన్ని అందించారు. అనిరుద్, విశాల్ దాడ్లాని, శిల్పా రావు పాటను తమదైన స్టైల్లో అద్భుతంగా ఆలపించారు. వైభవీ మర్చంట్ పాటకు కొరియోగ్రఫీ అందించడం గమనార్హం. తెలుగు వెర్షన్ పాటను ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాయగా శ్రీరామచంద్ర, రక్షిత సురేష్, అనిరుద్ పాడారు అదే సమయంలో తమిళ వెర్షన్ సాంగ్ కు వివేక్ సాహిత్యాన్ని అందించారు. అనిరుద్, శ్రీరామ్ చంద్ర, రక్షిత సురేష్ పాటను పాడారు. షారూఖ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 7న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!