Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shah Rukh Khan : మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకోవడం ఒక గొప్ప విషయం అయితే, వారితో ఆప్యాయంగా మెలగడం, వారి ప్రేమకు గౌరవం ఇవ్వడం మరో గొప్ప లక్షణం. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరోసారి అదే నిరూపించారు. కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తన స్టేజ్ ప్రెజెన్స్‌తోనే కాదు, అభిమానులతో చేసిన సరదా సంభాషణతో కూడా అందరి మనసులు గెలుచుకున్నారు. ముఖ్యంగా ఓ మహిళా అభిమాని చేసిన వ్యాఖ్యకు షారుఖ్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జూన్ 25న రోహన్ కార్పొరేషన్ నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమం కోసం మంగళూరుకు విచ్చేశారు షారుఖ్. ఈ కార్యక్రమానికి వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. షారుఖ్ ఖాన్ బ్లాక్ దుస్తుల్లో, స్టైలిష్ సన్‌గ్లాసెస్‌తో వేదికపైకి అడుగుపెట్టగానే అభిమానుల కేరింతలతో ఆ ప్రాంగణం మార్మోగిపోయింది. ఆయనను ఒక్కసారి ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతో పలువురు అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా మంగళూరుకు చేరుకున్నారు. వేదికపైకి వచ్చిన వెంటనే షారుఖ్ కన్నడలో “నమస్కారం” అంటూ ప్రేక్షకులను పలకరించడం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం మంగళూరు ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. విమానాశ్రయం నుంచి కార్యక్రమం జరిగే వేదిక వరకు ప్రజలు చూపించిన ఆత్మీయ స్వాగతం తనను ఎంతో ఆనందపరిచిందని చెప్పారు. తాను ఊహించిన దానికంటే ఎంతో గొప్ప ఆదరణ లభించిందని పేర్కొన్నారు.
Also Read
- Idupu Kayitham : బంతి భోజనాల్లో 'మందు' కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
- మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
- Mythri Ravi : 'ఫౌజీ', 'డ్రాగన్' రిలీజ్‌లపై వెనక్కి తగ్గేదే లేదు.. నాగార్జున కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుకున్నాం
- Shah Rukh Khan: ‘కింగ్’ ఎంట్రీ సీన్‌పై మైండ్ బ్లోయింగ్ లీక్!
అయితే ఈ కార్యక్రమంలో అభిమానులతో ముఖాముఖి నిర్వహించిన సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఒక మహిళా అభిమాని “నేను నా భర్త కంటే మిమ్మల్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను” అని చెప్పింది. ఆ మాట విన్న షారుఖ్ ఏమాత్రం తడబడకుండా చిరునవ్వుతో ఇలాంటి విషయాలు ఒంటరిగా చెప్పాలి కదా అంటూ సరదాగా స్పందించారు. ఆయన చమత్కారానికి అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. అంతటితో ఆగకుండా వెంటనే పరిస్థితిని మరింత ఉల్లాసంగా మార్చిన షారుఖ్, “మీ భావాలు నాకు అర్థమయ్యాయి. మీ భర్తకు కూడా అవి అర్థమయ్యాయని నేను నమ్ముతున్నాను, మీ అందరినీ ప్రేమిస్తున్నాను, మీ భర్తను కూడా ప్రేమిస్తున్నాను, మీ కుటుంబానికి కూడా నా ప్రేమ” అంటూ చెప్పడంతో అభిమానులు మరోసారి చప్పట్లతో అభినందించారు. ఈ సమాధానం ఆయన హాస్యచతురతతో పాటు అభిమానుల పట్ల ఉన్న గౌరవాన్ని కూడా ప్రతిబింబించిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఈ సంభాషణకు సంబంధించిన వీడియోలు, క్లిప్‌లు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. షారుఖ్ సమయస్పూర్తితో స్పందించే తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆయన ఎక్కడికి వెళ్లినా స్టార్ హీరోగా మాత్రమే కాకుండా, అభిమానులతో సన్నిహితంగా మెలిగే వ్యక్తిగా గుర్తింపు పొందుతున్నారు. బ్లాక్‌బస్టర్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న షారుఖ్ ఖాన్, ఇలాంటి చిన్న చిన్న క్షణాలతో కూడా ప్రజల హృదయాల్లో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటున్నారు. మంగళూరు పర్యటన కూడా అదే విషయాన్ని మరోసారి నిరూపించింది. సినిమా తెరపై తన నటనతో అలరించే షారుఖ్, నిజ జీవితంలో కూడా తన సరదా స్వభావం, వినయంతో అభిమానుల ప్రేమను మరింత గెలుచుకుంటూనే ఉన్నారు.
SRK Fangirl: I love you more than my husband 😍#ShahRukhKhan: Ye akele me batana tha, public me nahi 😂 pic.twitter.com/Pp3wjKFfFL
— $@M (@SAMTHEBESTEST_) June 26, 2026
- Tags
- cinema
- Shah Rukh Khan
తాజావార్తలు
-
Tilak Varma: ఆ ఒక్క టెక్నిక్ ఫాలో అయ్యాను.. అందుకే విజయం సాధించాం: తిలక్ వర్మ
-
Vivo S70: Visionox OLED డిస్ప్లే, 64MP కెమెరాతో Vivo S70 స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్!
-
Hyderabad: భాగ్యనగరంలో గన్ కల్చర్ కలకలం.. పంజాగుట్ట బార్లో రివాల్వర్‌తో బెదిరింపులు..
-
Heavy Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..
-
Tilak Varma: మ్యాచ్ గెలిచిన తర్వాత వర్మ వినూత్న సెలబ్రేషన్స్.. కౌంటర్ మాములుగా ఇవ్వలేదుగా..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!