బాలీవుడ్‌లో స్టార్‌లు చాలా మంది ఉన్నా, స్టార్‌డమ్‌ని ఒక ఎమోషన్‌గా మార్చినవాడు ఒక్కరే అది షారుక్‌ఖాన్. ఆయన సినిమాలు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కాదు, ఆయన స్క్రీన్‌పై కనిపిస్తే అభిమానులకు అది ఒక పండగ. అలాంటి షారుక్ ఇటీవల గాయపడటంతో అభిమానులు కంగారుపడ్డారు. తన తదుపరి చిత్రం ‘కింగ్’ షూటింగ్‌లో యాక్షన్ సన్నివేశం చేస్తూ షారుక్ భుజానికి గాయమయ్యింది. వెంటనే ముంబయిలో సర్జరీ చేశారు. షారుక్ గురించి ఆరోగ్య వార్తలు బయటకు రాగానే సోషల్ మీడియాలో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. “ఎంత త్వరగా కోలుకుంటారో అంత త్వరగా మాకు ఆనందం వస్తుంది” అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్స్‌తో ప్రార్థనలు చేశారు. ఇంతలోనే ఆయన ముంబయిలో జరిగిన ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి హాజరయ్యారు.
Also Read : Shraddha Kapoor : విఠాబాయిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్రద్ధా!
భుజానికి సపోర్ట్ ఉన్నా, ఆయన ముఖంలో ఎప్పటిలాగే చిరునవ్వు. అక్కడే అభిమానులను కదిలించేలా ఒక మెసేజ్ ఇచ్చారు.. ‘ ‘కింగ్’ షూటింగ్‌లో గాయమైంది.. సర్జరీ జరిగింది. ఇంకో రెండు నెలల్లో పూర్తిగా కోలుకుంటాను. అవార్డు అందుకోవడానికి ఒక చెయ్యి చాలు. కానీ నా అభిమానుల ప్రేమను భుజానికెత్తుకోవడానికి మాత్రం ఒక చెయ్యి సరిపోదు’ అని చెప్పగానే హాల్లో కూర్చున్నవాళ్లంతా చప్పట్లతో హోరెత్తించారు. గాయం తర్వాత కూడా తన ఫ్యాన్స్‌ని ఇంత పాజిటివ్‌గా ఎన్కరేజ్ చేయగలిగిన స్టార్ చాలా అరుదు. దీంతో షారుక్ మళ్లీ సెట్ మీదకు వెళ్లే రోజు కోసం ఇప్పుడు కోట్లాది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక్క చిరునవ్వే వారికి ఒక అవార్డు కంటే గొప్పది.