Mahesh babu: జవాన్ కోసం ఆగలేకున్నానంటూ మహేష్ ట్వీట్.. కలిసి చూద్దామన్నా షారుఖ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shah Rukh Khan Wants to Watch Jawan movie with mahesh babu: పఠాన్ తో బాలీవుడ్ రికార్డులు అన్నీ తిరగరాసిన షారుఖ్ ఖాన్ హీరోగా వస్తున్న జవాన్ రిలీజ్‌కు ఇంకా కొన్ని గంటలే మిగులుంది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కగా ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లు సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో షారుఖ్‌కు జోడీగా నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. హిందీతో పాటు తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. ను రెడ్ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతివిలన్ నాయకుడి పాత్ర పోషించాడు. ఇక ట్రైలర్ కట్ సూపర్ గా ఉండడంతో టిక్కెట్‌లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సౌత్‌లోనూ ఈ సినిమా క్రేజ్ ఒక రేంజ్ లో ఉంది.
Divya Spandana: నిద్ర పోతున్న ‘దివ్య స్పందన’.. లేపి మరణ వార్త చెప్పడంతో షాక్.. అసలు ఏమైందంటే?
Also Read
ఒకప్పుడు హిందీ సినిమాలు అంటే హైదరాబాద్ వరకు బాగానే ఆడేవి. కానీ ఈ జవాన్ కి ఏపీలో కూడా పలు సిటీలలో బుకింగ్స్ వేరే రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా కోసం కేవలం సాధారణ సినీ ప్రియులు మాత్రమే కాకుండా సినీ సెలబ్రెటీలు సైతం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇదే విషయాన్ని మహేష్ ట్విటర్‌లో వెల్లడించారు. ‘ జవాన్ టైమ్ వచ్చేసింది, షారుక్ ఖాన్ పవర్ మొత్తం సిల్వర్ స్క్రీన్ మీద కనబడబోతుంది, ఈ సినిమా అన్ని మార్కెట్లలోనూ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసేందుకు ఎదురు చూస్తున్నానంటూ’ మహేష్ వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ట్వీట్‌పై షారుఖ్ ఖాన్ స్పందింస్తూ ‘మీరు సినిమాను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా, మీరు ఎప్పుడు సినిమాకు వెళ్తారో చెప్పండి మీతో పాటు కలిసి సినిమా చూస్తానంటూ’ షారుఖ్ దానికి ట్వీట్ చేశాడు.
Thank u so much my friend. Hope you enjoy the film. Let me know when you are watching I will come over and watch it with you. Love to you and the family. Big hug. https://t.co/xW0ZD65uvk
— Shah Rukh Khan (@iamsrk) September 6, 2023
- Tags
- jawan
- mahesh babu
తాజావార్తలు
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!