NTV Telugu Site icon

Ravi Teja : మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ను భయపెడుతున్న సీక్వెల్

Raviteja

Raviteja

మాస్ మహారాజ్ రవితేజ ఈసారి మాస్ జాతర అంటూ త్వరలో రాబోతున్నాడు. ఓ సినిమా హిట్టు కొట్టి మూడు, నాలుగు ప్లాపులతో సతమతమౌతున్న రవి ఈసారి పక్కా హిట్టు కొట్టాలని ప్రిపరేషన్స్ చేస్తున్నాడు. తన కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీ ధమాకాలో యాక్ట్ చేసిన శ్రీలీలతో మరోసారి జోడీ కట్టబోతున్నాడు ఈ స్టార్ హీరో. అయితే ఈ సినిమా తర్వాత అదే ధమాకా దర్శకుడు నక్కిన త్రినాధరావుతో వర్క్ చేయబోతున్నాడట రవితేజ.

Also Read : Kayadu Lohar : వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న డ్రాగన్ బ్యూటీ

2022లో వచ్చిన ధమాకా రవితేజ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలవడమే కాదు వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది. ఇప్పుడు మజాకాతో ప్రేక్షకులను పలకరించిన ఈ డైరెక్టర్ నెక్ట్స్ రవితేజతో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాకైందని, దిల్ రాజు నిర్మాణంలో సినిమా ఉండబోతుందని టాక్. ఈ సినిమా ధమాకాకు సీక్వెల్ అన్న టాక్ నడుస్తోంది. డబుల్ ధమాకాగా టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. హిట్టు బొమ్మ ధమాకాకు సీక్వెల్ అంటే రవితేజ ఫ్యాన్స్ లో భయం పట్టుకుంది. ఎందుకంటే రవితేజకు సీక్వెల్స్ కలిసి రాకపోవడమే. అంతకు ముందు కిక్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి కొనసాగింపుగా కిక్ 2 వచ్చింది. అది ఎలాంటి రిజల్ట్ చూసిందే ప్రేక్షకులకు తెలుసు. అలాగే డిస్కో రాజాకు కూడా రిలీజ్ కాకుండానే సీక్వెల్ అనుకున్నారు. ఇది బాక్సాఫీస్ బాంబ్ గా మారడంతో సెకండ్ పార్ట్ వైపు చూడలేదు.  మళ్లీ ఇప్పుడు ధమాకాకు సీక్వెల్ అంటే టెన్షన్ పడుతున్నారు మాస్ మహారాజ్ అభిమానులు. మరి మాస్ మహారాజ్ ఎలాంటిప్లానింగ్ తో వస్తాడో చూడాలి.