Progress Report: ఈ ఏడాదిలో అత్యధిక చిత్రాలు విడుదలైన నెల ఏదైనా ఉందంటే అది సెప్టెంబరే. ఈ నెలలో డబ్బింగ్ తో కలిసి ఏకంగా 33 సినిమాలు జనం ముందుకు వచ్చాయి. చిత్రం ఏమంటే… జూలై మాసం మాదిరి గానే ఈ నెలలో ఒక్క చిత్రమూ ఆశించిన స్థాయిలో ఆడలేదు. మొదటి శుక్రవారం వచ్చిన యంగ్ హీరోస్ మూవీస్ ‘రంగ రంగ వైభవంగా, ఫస్ట్ డే ఫస్ట్ షో, బుజ్జీ ఇలా రా’ డిఫరెంట్ జానర్లకు చెందినవే అయినా… ఇందులో ఏదీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రెండోవారంలో వచ్చిన ఆర్య యాక్షన్ డబ్బింగ్ మూవీ ‘కెప్టెన్’ నిరాశకు గురి చేసింది. శర్వానంద్ నటించిన ‘ఒకే ఒక్క జీవితం’ ఫీల్ గుడ్ మూవీ అనే పేరు తెచ్చుకుంది కానీ కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. బాధాకరం ఏమంటే.. భారీ అంచనాలతో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్రం’ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. థర్డ్ ఫ్రైడే వచ్చిన సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, రెజీనా, అనుపమా పరమేశ్వరన్ ‘శాకిని డాకిని’, కిరణ్ అబ్బవరం ‘నేను మీకు కావాల్సిన వాడిని’ చిత్రాలూ ఫ్లాప్ అయ్యాయి. ఆ వీకెండ్ లో వచ్చిన శింబు ‘ముత్తు’ కూడా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. ఆ తర్వాత వారం వచ్చిన శ్రీవిష్ణు ‘అ్లలూరి’, నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’, శ్రీసింహా ‘దొంగలున్నారు జాగ్రత్త’ ఏ స్థాయిలోనూ మెప్పించలేకపోయాయి. ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయిన తమన్నా హిందీ అనువాద చిత్రం ‘బబ్లీ బౌన్సర్’ సైతం పేలవమైన ప్రభావాన్నే చూపించింది.
Read Also: Karthikeya 2: ‘కార్తికేయ 2’ కు ప్రాణం.. శ్రీ కృష్ణుడు గొప్పతనం ఇదే
ఇవన్నీ ఒక ఎత్తుకాగా, సెప్టెంబర్ లాస్ట్ ఫ్రైడే భారీ అంచనాలతో వచ్చిన మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్ -1’ పరాజయం మరో ఎత్తు. ఈ సినిమాను ‘బాహుబలి’తో పోల్చుతూ తెలుగు ప్రేక్షకులు తిరస్కరించారు. దానికి ఓ రోజు ముందు వచ్చిన ధనుష్ ‘నేనే వస్తున్నా’ కూడా థియేటర్లలో సందడి చేయలేకపోయింది. సెప్టెంబర్ మాసంలో 25 స్ట్రయిట్ తెలుగు సినిమాలు విడుదలైతే, ఎనిమిది అనువాద చిత్రాలు వచ్చాయి. అందులో విక్రమ్, ధనుష్, శింబు, ఆర్య, రణబీర్ కపూర్ వంటి స్టార్స్ చేసిన సినిమాలూ ఉన్నాయి. పక్క రాష్ట్రాల సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేయడం విశేషం. దాంతో ఇప్పుడు తెలుగు ప్రేక్షకులంతా దసరా కానుకగా రేపు శుక్రవారం విడుదల కాబోతున్న చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ది ఘోస్ట్’, బెల్లంకొండ గణేశ్ ‘స్వాతిముత్యం’ మూవీస్ పై ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలు విజయం సాధిస్తే… సినీ అభిమానులకు ఇది డబుల్ థమాకా అందించిన దసరాగా గుర్తుంటుంది.