Karthikeya 2: యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. రెండు నెలల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికి ఇంకా థియేటర్లో అలరిస్తూనే ఉంది. నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా దసరా కానుకగా జీ 5 ఓటిటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఓటిటీ లో వస్తున్నట్లు ఇటీవలే ప్రకటించిన జీ 5 ప్రమోషన్లను షురూ చేసింది. సినిమా మొత్తంలో హైలైట్ గా నిలిచిన సీన్ ను రిలీజ్ చేసి ప్రేక్షకులను ఫిదా చేశారు. ఇందులో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్.. శ్రీకృష్ణుడు గురించి గొప్పగా చెప్పే సీన్ కు ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే.
” శ్రీ కృష్ణుడును దేవుడు అని ముద్ర వేసి మనిషికి నెలకు దూరం చేయవద్దు..” అంటూ మొదలైన డైలాగ్ ఆయన ఎవరు.. ఎందుకు భూమి మీదకు వచ్చాడు.. ఆయన నుంచి ప్రతి ఒక్కరు ఏం నేర్చుకోవాలి.. ఆయనను మించిన గొప్ప వైద్యుడు, శాస్త్రవేత్త, సంగీత విద్వాంసులు ఎవరు అని అనుపమ్ ఖేర్ చెప్తూంటే.. శ్రీ కృష్ణుడిపై అపారమైన భక్తి కలుగ మానదు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే డైలాగ్ వచ్చేటప్పుడు వెనుక బ్యాక్ గ్రౌడ్ స్కోర్ లో కృష్ణంవందే జగద్గురమ్ అనే సాంగ్ మరో హైలైట్. సినిమా మొత్తానికి ఈ సీన్ ప్రాణమని చెప్పొచ్చు. ఇక ఈ సీన్ ను రిలీజ్ చేసి మేకర్స్ ఫ్యాన్స్ ను ఫిదా చేసేశారు. శ్రీ కృష్ణుడు గొప్పతనం చెప్పిన ఈ సీన్ ప్రస్తుతం యు ట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 5 న స్ట్రీమింగ్ కానుంది. మరి డిజిటల్ లో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.