ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న సినిమా ‘దేవర’. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ ఈ సినిమా, మోషన్ పోస్టర్ తోనే టాక్ ది నేషన్ గా మారింది. దేవరగా టైటిల్ అనౌన్స్ చేస్తూ వదిలిన ఫస్ట్ లుక్ తో పాన్ ఇండియా బజ్ కి క్రియేట్ చేసారు ఎన్టీఆర్, కొరటాల శివ. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి.. యాక్షన్ సీన్స్‌నే తెరకెక్కిస్తున్నారు. ఒక్కో షెడ్యూల్‌ను ఒక్కో యుధ్దంలా చిత్రీకరిస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం ముందుగా యాక్షన్ సీన్స్‌ను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని భారీ యాక్షన్స్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది దేవర. త్వరలోనే మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఇది కూడా పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూలే అని తెలుస్తోంది. ఇప్పటివరకు వచ్చిన అవుట్ ఫుట్‌తో చాలా హ్యాపీగా ఉన్నారట ఎన్టీఆర్, కొరటాల. ఈసారి బాక్సాఫీస్ ని పాన్ ఇండియా రేంజులో రిపేర్ చేయడానికి రెడీ అయిన ఎన్టీఆర్-కొరటాల శివలకి కలిసిన మరో ఆయుధం అనిరుద్. విక్రమ్, జైలర్ సినిమాలకి ప్రాణం పోసిన అనిరుద్… దేవర కోసం రంగంలోకి దిగిపోయాడు.
🖋️🎶 #Devara https://t.co/XWjE6G0gLr
— Devara (@DevaraMovie) August 12, 2023
దేవర టైటిల్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి… “right now on the job” అంటూ ట్వీట్ చేసాడు. దీంతో దేవర పాటల పని మొదలయ్యినట్లు తెలుస్తుంది. దీంతో ఇప్పటి నుంచే దేవర ఆల్బమ్ పై అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా విక్రమ్, జైలర్ సినిమాలు చూసిన తర్వాత దేవర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌కు వెళ్లిపోయాయి. ఖచ్చితంగా అనిరుధ్ ‘దేవర’ సినిమాకు పాటలు, బీజిఎం ఇరగదీస్తాడని నందమూరి ఫ్యాన్స్ నమ్మతున్నారు. మరి ట్రెమండస్ ఫామ్ లో ఉన్న అనిరుద్, ఎన్టీఆర్ దేవర కోసం ఎలాంటి అద్భుతాన్ని సృష్టిస్తాడో చూడాలి.