Kakarla Krishna : టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నిర్మాత కన్నుమూత!
- ప్రముఖ సీనియర్ నిర్మాత కాకర్ల కృష్ణ శనివారం కన్నుమూశారు
- 'జగపతి' సంస్థలో ప్రొడక్షన్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించి తన స్వయంకృషితో నిర్మాతగా ఎదిగారు
- 1974లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'ఇంటింటి కథ' చిత్రంతో ఆయన నిర్మాతగా మారారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక సామాన్య ప్రొడక్షన్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించి, తన స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్లో సీనియర్ నిర్మాతగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కాకర్ల కృష్ణ (09-05-2026) శనివారం నాడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సందర్భంగా ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్’ ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, శోకతప్తులైన ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
కాకర్ల కృష్ణ సినీ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఆయన తొలినాళ్లలో ప్రముఖ నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్ ప్రతిష్టాత్మక ‘జగపతి’ సంస్థలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేశారు. అక్కడ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటూ తన సత్తా చాటారు. ఆ అనుభవంతో 1974లో కె. సత్యం దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, అంజలీదేవి, చంద్రకళ ప్రధాన తారాగణంగా రూపొందిన ‘ఇంటింటి కథ’ చిత్రంతో ఆయన నిర్మాతగా మారారు. అనంతరం ‘ఏడంతస్తుల మేడ’, ‘ఊరంతా సంక్రాంతి’, ‘రాగ దీపం’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఆయన భాగస్వామిగా పనిచేశారు. కాకర్ల కృష్ణ నిర్మాతగా పరిచయమైన ‘ఇంటింటి కథ’ విడుదలై 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా 2023లో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ కృష్ణ ఎంతో చురుగ్గా ఉండేవారు. ఫిల్మ్‌నగర్ గృహ నిర్మాణ సంస్థలో, వి.బి. రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ప్రారంభమైన ‘ఫిల్మ్‌నగర్ దైవ సన్నిధానం’లో ఆయన కమిటీ సభ్యుడిగా ఉండి ఎనలేని సేవలందించారు.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!