Site icon NTV Telugu

Bollywood : బాలీవుడ్‌లో హవా సాగిస్తున్న సీనియర్ భామలు

Bollywood

Bollywood

గ్లామర్ ఫీల్డ్‌లో హీరోయిన్ల స్క్రీన్ ప్రజెన్సే కాదు.. కెరీర్ స్పాన్ చాలా తక్కువ. పెళ్లై, పిల్లలే ఉండాల్సిన అవసరం లేదు.. జస్ట్ 35 ప్లస్ ఏజ్ దాటితే.. యాక్టింగ్‌కు బై బై చెప్పాలిందే. లేదంటే మదర్, సిస్టర్, వదిన క్యారెక్టర్లకు షిఫ్ట్ చేస్తుంటారు. అది వన్స్ ఆపాన్ ఏ టైం ముచ్చట. ఇప్పుడు ట్రెండ్ మారింది. 35 కాదు.. 45 ప్లస్‌లో కూడా సీనియర్ భామలు లీడ్ యాక్టర్లుగా మారి రప్పాడిస్తున్నారు. ఈ ధోరణికి ఆజ్యం పోసింది బాలీవుడ్.

Also Read :Atharvaa : హిట్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న స్టార్ కిడ్

ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ జస్ట్ ఫ్యూ ఇయర్స్. అదీ కూడా బాగా క్లిక్ అయితేనే. వరుస హిట్లు కొట్టి లక్కీ లేడీ, గోల్డెన్ లెగ్ అనిపించుకుంటేనే కొన్నేళ్లు రాణించగలరు. లేదంటే గుడ్ బై చెప్పాల్సిందే. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు ఇదే తీరు కనబడుతోంది. అది ఒకప్పటి ముచ్చట. ఇప్పుడు ట్రెండ్ మారింది. ముఖ్యంగా నార్త్ బెల్ట్‌లో. యంగ్ ఏజ్‌లోనే కాదు 45 ప్లస్‌లోనూ హీరోయిన్లుగా మారి ట్రెండ్ సృష్టిస్తున్నారు విద్యాబాలన్, టబు, కాజోల్, ఐశ్వర్యరాయ్, రాణిముఖర్జీ, చిత్రాంగద సింగ్ లాంటి సీనియర్ భామలు. ఫీమేల్ లీడ్ యాక్టర్లుగా డిమాండ్ ఉండటంతో రెమ్యునరేషన్స్ కూడా భారీగానే చార్జ్ చేస్తున్నారు. కాజోల్ రీసెంట్ టైమ్స్‌లో సెలక్టివ్ స్క్రిప్ట్‌తో దూసుకెళుతోంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ సలామ్ వెంకీ, లస్ట్ స్టోరీస్2, దో పట్టీ, ‘మా’ చిత్రాలు. ఇవి డిఫరెంట్ జోనర్ అండ్ డిఫరెండ్ ఎక్స్ పీరియన్స్ మూవీస్. ఓటీటీ, థియేటర్ ఏదైనా అమితమైన ఫ్యాన్ బేస్ ఆమె సొంతం. విద్యా బాలన్ కెరీర్ స్టార్టింగ్ నుండే తన క్యారెక్టర్‌కు వెయిటేజ్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది. వాస్తవంగా బాలీవుడ్‌లో లేడీ ఓరియెంట్ చిత్రాలకు ఊపిరిపోసింది విద్యానే. టబు 50 ప్లస్ ఏజ్‌లో కూడా సౌత్, నార్త్ అని తేడా లేకుండా నటించేస్తోంది. ఇప్పటికీ ఆమెకు విపరీతమైన డిమాండ్ ఉండటం విశేషం.

Exit mobile version