Rakshit Shetty: ఆమెను ఎంతో ప్రేమించా.. కానీ, వాడు ఆ పని చేసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rakshit Shetty: కన్నడ నటుడు రక్షిత్ శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంటే తెలుగులో అతను డైరెక్ట్ గా మూవీ చేయకపోయినా.. నేషనల్ క్రష్ రష్మిక.. నిశ్చితార్థం చేసుకొని క్యానిస్ల చేసిన పెళ్లి కొడుకుగా తెలుగువారికి బాగా సుపరిచితుడు రక్షిత్. ఇక ఈ ఘటన తరువాత.. రక్షిత్ తన సినిమాలతో కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించడం మొదలుపెట్టాడు. అతడే శ్రీమన్నారాయణ అనే సినిమాతో టాలీవుడ్ లో కూడా హిట్ అందుకున్నాడు. అప్పటినుంచి అతడి ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవుతూ వస్తుంది. గతేడాది 777 ఛార్లీ తో హిట్ అందుకున్న రక్షిత్.. ఈ ఏడాది సప్తసాగరాలు దాటి సైడ్ A అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హేమంత్.ఎం.రావు దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమాను తెలుగులో సెప్టెంబర్ 22న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, రక్షిత్ శెట్టి విడుదల చేశారు. ఇక్కడ కూడా మంచి ఆదరణనే అందుకుంది. ఇక సప్తసాగరాలు దాటి సైడ్ B నవంబర్ 17 న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఈ నేపథ్యంలోన ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర బృందం వరుస ఇంటర్వూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు.
Salaar: డైనోసర్ ల్యాండ్ అయ్యాడు.. ఇంకా మొదలెట్టరేంటి.. ?
Also Read
- Dharman : రజనీకాంత్ ధర్మన్ సినిమాలో రామ్ పోతినేని?
- Fast Forever: 25 ఏళ్ల ప్రయాణానికి గ్రాండ్ ఫినాలే.. ‘ఫాస్ట్ ఫరెవర్’పై భారీ అప్డేట్
- Sangeeth Sobhan: పుట్టినరోజున డబుల్ సర్ప్రైజ్.. సంగీత్ శోభన్ రెండు కొత్త సినిమాల ప్రకటన
- Nandamuri Mokshagna : వశిష్ఠ డైరెక్షన్లో నందమూరి సింబా మోక్షజ్ఞ సినిమా ఫిక్స్?
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో రక్షిత్ తన జీవితంలో మొదటి లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు. ” నేను ఇంజినీరింగ్ సెకండియర్ చదివేటప్పుడు ఒక అమ్మాయిని చూశా. చాలా రోజులు తిరిగి తనకి లవ్ లెటర్ రాసి.. ఇద్దామనుకున్నా.. నేను హాస్టల్ లో ఉండేవాడిని. ఆమె బస్సులో వచ్చేది. దీంతో అదే బస్సులో వచ్చే నా ఫ్రెండ్ కు ఆ లెటర్ ఇచ్చి.. తనకు ఇవ్వమని చెప్పాను. లెటర్ ఇచ్చాకా కూడా ఆమెలో ఎలాంటి ఫీలింగ్ నాకు కనిపించలేదు. అలా చాలాసార్లు లెటర్ ఇవ్వడం.. ఆమె చూడకపోవడం ఇలా రెండేళ్లు గడిచిపోయాయి కానీ, ఆమెనుంచి నాకు ఎలాంటి సమాధానం రాలేదు. నా కాలేజ్ అయిపోయాక నాకు తెలిసింది ఏంటంటే నేను ఇచ్చిన లెటర్స్‌ని నా ఫ్రెండ్, ఆ అమ్మాయికి ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే.. ఇప్పుడు వారిద్దరూ భార్యాభర్తలు” అని చెప్పడంతో పక్కన ఉన్న హీరోయిన్స్ తో పాటు యాంకర్ కూడా షాక్ అయ్యి నవ్వడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
Dharman : రజనీకాంత్ ధర్మన్ సినిమాలో రామ్ పోతినేని?
-
China swine Flu Case: చైనాలో తొలిసారి మనిషికి స్వైన్ ఫ్లూ A(H1N2)v.. భారత్‌కు ముప్పు ఎంత?
-
Tamil Nadu: CJPపై విజయ్ సర్కార్ సంచలన ఆదేశాలు.. ఆ తర్వాత యూ-టర్న్..
-
Indian Bowler: 10 వికెట్లతో శ్రీలంక నడ్డి విరిచిన భారత యువ బౌలర్.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం..
-
Fast Forever: 25 ఏళ్ల ప్రయాణానికి గ్రాండ్ ఫినాలే.. ‘ఫాస్ట్ ఫరెవర్’పై భారీ అప్డేట్
ట్రెండింగ్
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్‌తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!