Site icon NTV Telugu

Prasad Babu : నా కొడుకు చనిపోవాలని కోరుకున్నా.. సీనియర్ హీరో షాకింగ్ కామెంట్స్

Prasad Babu

Prasad Babu

Prasad Babu : తన కొడుకు బతికి ఉండగానే చనిపోవాలని కోరుకున్నట్టు సీనియర్ హీరో, నటుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఎవరో కాదు 1500లకు పైగా సినిమాల్లో నటించిన ప్రసాద్ బాబు. ఆయన గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఆయన ఒకప్పుడు హీరోగా, నటుడిగా, దర్శకుడిగా కూడా పనిచేశారు. తాజాగా ప్రసాద్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా పెద్ద కొడుకు మానసిక వికలాంగుడు. వాడు మాట్లాడలేడు. వాడిని నేను జాగ్రత్తగా చూసుకునేవాడిని. ఓ సారి స్కూల్ లో అందరితో కలిసి నా కొడుకును ఢిల్లీకి ఓ ప్రోగ్రామ్ కు తీసుకెళ్లారు. అప్పుడు నా మీద నాకు కోపం వచ్చింది.

Read Also : Allu Arjun : ప్రభాస్ దారిలో వెళ్తున్న అల్లు అర్జున్..?

నేను తండ్రిని అయి ఉండి ఏం చేస్తున్నాను అనుకున్నాను. ఆ ఆలోచనతోనే సాహసబాలలు సినిమా తీశా. అందులో మురళీ మోహన్‌, నాగబాబు, సోమయాజులు.. ఇలా చాలామంది యాక్ట్‌ చేశారు. కానీ నా కొడుకును నేను బతికుండగానే చనిపోవాలని కోరుకున్నాను. ఎందుకంటే నేను చనిపోయాక వాడిని ఎవరు చూసుకుంటారు అనుకునేవాడిని. ఓ సారి క్రికెట్ ఆడుతుండగా వాడికి వడదెబ్బ తగిలింది. ఆ టైమ్ లోనే హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడే చనిపోయాడు. అప్పుడు నా ఏజ్ 30 ఏళ్లు. వాడు చనిపోయినందుకు బాధ ఎంత ఉండేదే సంతోషం కూడా ఉండేది. ఎందుకంటే నేను ముందు చనిపోతే వాడిని ఎవరూ పట్టించుకోక నానా ఇబ్బందులు పడేవాడు. ఆ విషయంలో దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు ప్రసాద్ బాబు.

Read Also : Anushka vs Rashmika : అనుష్క ముందు రష్మిక నిలబడుతుందా..?

Exit mobile version