NTV Telugu Site icon

Kalaavathi Song : డ్యాన్స్ అదరగొట్టేసిన తమన్… వీడియో వైరల్

Kalavathi-Song

సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” చిత్రం మేలో విడుదల కానుంది. ఈ చిత్రం నుండి “కళావతి” అనే సాంగ్ ఫిబ్రవరి 13న ప్రేమికుల రోజు కానుకగా విడుదల చేశారు మేకర్స్. ఫిబ్రవరి 14న విడుదల కావాల్సిన ఈ సాంగ్ ముందుగానే లీక్ అవ్వడంతో ఒకరోజు ముందే విడుదల చేశారు. అప్పటి నుంచి “కళావతి” యూట్యూబ్ రికార్డులను బద్దలు కొడుతూ, సరికొత్త దిశగా దూసుకెళ్తోంది. “సర్కారు వారి పాట” స్వరకర్త ఎస్ఎస్ తమన్ పై ఈ సాంగ్ ట్యూన్ అదిరిపోయింది అంటూ ప్రశంసల జల్లు కురుస్తోంది. మరోవైపు ట్రెండింగ్ గా మారిన ఈ సాంగ్ పై సెలెబ్రిటీలు సైతం చిందేస్తున్నారు. ఇప్పటికే కీర్తి సురేష్, సితార ఇద్దరూ సాంగ్ కు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కాగా, తాజాగా తమన్ అదిరిపోయే స్టెప్పులతో పవర్ స్టార్ అభిమానులను ఆకట్టుకున్నాడు. డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ తో కలిసి “కళావతి” సాంగ్ కు స్టెప్పులేసి తమన్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Read Also : Samantha : ‘I wanna reproduce you’ అన్న నెటిజన్… సామ్ ఎపిక్ రిప్లై

ఇక ఈ పాటను సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడారు. సినిమాలో కళావతి పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుంది. పరశురామ్ పెట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌ కానుకగా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.