Site icon NTV Telugu

SeethaRamam: యుద్దానికి వెళ్లే సైనికుడు అమ్మాయి ప్రేమలో పడితే..

Seetaramam

Seetaramam

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా రష్మిక ప్రధాన పాత్రలో హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమా ప‌తాకంపై  అశ్విని దత్‌, ప్రియాంక్‌ దత్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యుద్ధంతో రాసిన ప్రేమకథ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నేడు శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని రిలీజ్ చేశారు. సీతారాముల ప్రేమకథకు గుర్తుగా ఈ సినిమాకు సీతా రామం అనే డిలీట్ ని ఫిక్స్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా  రిలీజ్ చేశారు.

“ఇది ఓ సైనికుడు శత్రువుకు అప్పగించిన యుద్దం అఫ్రీన్‌.. ఈ యుద్దంలో సీతారాములను నువ్వే గెలిపించాలి అంటూ సుమంత్ వాయిస్ తో మొదలైన ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంది. యుద్దానికి వెళ్తున్న ఓ సైనికుడు.. అనుకోకుండా ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడితే.. ఆ ప్రేమ ఎలాంటి యుద్దానికి దారి తీసింది అనేది కథగా తెలుస్తోంది. ఇందులో రాముడిగా దుల్కర్ కనిపిస్తుండగా.. సీతగా మృణాల్ ఠాకూర్ కనిపించింది. ఇక సీతారాములను కలిపే ఆంజనేయుడి పాత్రలో రష్మిక కనిపిస్తున్నదని టాక్.. ప్రస్తుతం ఈ వీడియోతో సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది . మరి ఈ చిత్రంతో హనురాఘవపూడి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version