Screen Damaged by pawan fans before Bro movie screeing: తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం సినిమాను తెలుగులో బ్రో పేరుతో రీమేక్ చేశారు. అక్కడ డైరెక్ట్ చేసిన సముద్రఖని తెలగులో కూడా డైరెక్ట్ చేయగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించడంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు పవన్ లైనప్ లో ఉన్న అన్ని సినిమాల కన్నా లేట్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యి, అన్నింటికన్నా ముందు రిలీజ్ అయింది ఈ సినిమా. పవన్ పాత సినిమాలలోని పాటలు కూడా ఉండడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వింటేజ్ వైబ్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్ లోకి ఎంటర్ అయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మంచి జోష్ లో థియేటర్ నుంచి బయటకి వస్తాడని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Samantha: ఆ విషయంలో వంద మార్కులు.. ట్రిప్పులో ‘సమంత’ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు!
నిజానికి పవన్ కళ్యాణ్ మామూలుగా కనిపిస్తేనే ఫ్యాన్స్ రచ్చ చేస్తారు అలాంటిది వింటేజ్ వైబ్స్ ఇచ్చే రేంజులో కనిపిస్తున్నాడు అంటే వర్షాలని కూడా లెక్క చేయకుండా థియేటర్స్ కి క్యూ కట్టేస్తున్నారు. అయితే ఒక చోట మాత్రం పవన్ అభిమానులు అత్యుత్సాహంతో స్క్రీన్ చింపేసిన ఘటన హాట్ టాపిక్ అయింది. పార్వతీపురం మన్యం జిల్లా సౌందర్య థియేటర్లో పవన్ కళ్యాణ్ “బ్రో” సినిమా రిలీజ్ అవడంతో అక్కడి పవన్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. అయితే అత్యుత్సాహంతో స్క్రీన్ పై పాలాభిషేకం చేసి ఆ తోపులాటలో స్క్రీన్ మీద పడి దాన్ని చింపారు. దీంతో స్క్రీనింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఇక థియేటర్ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో స్క్రీన్ చింపిన అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.