Sawan Kumar Tak: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ మరియు నిర్మాత శవన్ కుమార్ తక్ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం గుండెపోటు రావడంతో శరీర అవయవాలు ఏమి పనిచేయలేదని, వైద్యులు ఎంత ప్రయత్నించిన శవన్ ను కాపాడలేకపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రస్తుతం ఆయన వయస్సు 86. ఇక శవన్ బాలీవుడ్ లో పలు సినిమాలకు దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ముఖ్యంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ తో శవన్ .. సావన్ – ది లవ్ సీజన్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక శవన్ మరణ వార్త విన్న సల్మాన్ భావోద్వేగంతో ఆయనకు సంతాపం వ్యక్తం చేశాడు. “శవన్ జీ .. మీరంటే నాకు అమితమైన ప్రేమ, గౌరవం.. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను” అంటూ ఆయనతో ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఇక సల్మాన్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా శవన్ కు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ మృతితో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.
May u rest in peace my dear Sawaan ji. Have always loved n respected u. pic.twitter.com/SH3BhYxco8
— Salman Khan (@BeingSalmanKhan) August 25, 2022