Ajith Kumar : విడాముయర్చి ‘సవదీక’ లిరికల్ సాంగ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర కథానాయకుడు అజిత్‌కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయర్చి’. ఈ సినిమా వచ్చే 2025 సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ సినిమా కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
రీసెంట్‌గా విడుదలైన విడాముయర్చి సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ అంచనాలను నెక్ట్స్ లవెల్‌కు తీసుకెళుతూ మేకర్స్ ఈ మూవీ నుంచి ‘సవదీక’ అనే ఫాస్ట్ బీట్ ఎనర్జిటిక్ సాంగ్‌ను మేకర్స్ శుక్రవారం రోజున విడుదల చేశారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన తనదైన శైలిలో మరో సూపర్బ్ ట్యూన్‌తో సవదీక సాంగ్‌ను కంపోజ్ చేశారు. ఆంథోని దాసన్ పాడిన ఈ పాటను అరివు రాశారు. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను, వైవిధ్యమైన చిత్రాలతో యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ సినిమాలను నిర్మిస్తోన్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి.కె.ఎం.తమిళ్ కుమరన్ నేతృత్వంలో సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఇంకా ఈ చిత్రంలో ఆరవ్, రెజీనా కసండ్ర, నిఖిల్ నాయర్ తదితరులు ఇతర పాత్రల్లో మెప్పించనున్నారు. ‘విడాముయర్చి’ సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతుంది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!