Rao Bahadur OTT: ఐదు భాషల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘రావ్ బహదూర్’.. త్వరలోనే స్ట్రీమింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rao Bahadur OTT: థియేటర్లలో ఉత్కంఠమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘రావ్ బహదూర్’. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నటుడు సత్యదేవ్, రచయిత దర్శకుడు వెంకటేష్ మహాల మరోసారి కలిసి రూపొందించిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి సినీ అభిమానుల్లో మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాను డిజిటల్ ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైంది. నిర్మాతలు ‘రావ్ బహదూర్’ 2026 జూలై 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఈ మూవీ కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితం కాకుండా, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి అందుబాటులోకి రానుంది. దీంతో దేశవ్యాప్తంగా ఈ మూవీని తమ మాతృభాషలో చూసే అవకాశం పొందనున్నారు ఓటీటీ ఆడియన్స్.
గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించకపోయినా, కథనం, దర్శకత్వం, సత్యదేవ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా కథలోని సైకలాజికల్ ట్విస్టులు, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లే, నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. థియేటర్లలో విడుదల తర్వాత కూడా సోషల్ మీడియాలో ఈ సినిమాపై చర్చ కొనసాగడం, ఓటీటీ విడుదలపై ఆసక్తిని మరింత పెంచింది. ఈ చిత్రంలో సత్యదేవ్ సరసన దీపా థామస్ కథానాయికగా నటించారు. అలాగే వికాస్ ముప్పాల, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ఈ మూవీని చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, ఈశ్వరన్ విజయరాఘవన్ సంయుక్తంగా నిర్మించగా, స్మరణ్ సాయి సంగీతం అందించారు. వెంకటేష్ మహా దర్శకత్వంలో థియేటర్లలో మంచి స్పందన పొందిన ‘రావ్ బహదూర్’ ఇప్పుడు ఓటీటీలో మరింత పెద్ద ప్రేక్షకాదరణ పొందుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సైకలాజికల్ థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బెస్ట్ ఛాయిస్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదు భాషల్లో విడుదల కావడం వల్ల ఈ మూవీకి పాన్ ఇండియా స్థాయిలో మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
- Tags
- cinema
- netflix
- Rao Bahadur OTT
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!