సత్యదేవ్ బాలీవుడ్ మూవీ ‘హబీబ్’ పాటల్లో ఆఫ్ఘన్ సాహిత్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, తిమ్మరుసు’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను పోషించి నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న సత్యదేవ్ ఇప్పుడు ‘హబీబ్’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ ఎమోషనల్ సాంగ్‌ను యూనిట్ ఆదివారం విడుదల చేసింది. ఈ పాట ఆఫ్ఘన్ సాహిత్యంతో ఉండటం విశేషం. ఇండియా, ఆఫ్ఘనిస్థాన్ ప్రజలందరికీ ఈ పాటను అంకితం చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఈ మూవీ కథ గురించి నిర్మాతలు హబీబ్ సఫీ, కోటి రావ్ తెలుపుతూ, ”కొంత మంది చిన్నపిల్లలను ఇండియా నుంచి సరిహద్దు దాటించి పాకిస్థాన్ తీసుకెళ్లి ఉగ్రవాద చర్యలు చేయడానికి శిక్షణ ఇప్పిస్తుంటారు. అక్కడి నుంచి ఆ పిల్లలను ఆఫ్ఘనిస్థాన్‌కు పంపుతారు.అలా ఉగ్రవాదుల చేతుల్లో చిక్కుకున్న తన కొడుకుని వెతుక్కుంటూ ఆఫ్ఘనిస్థాన్‌కు వెళ్లే ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కథే ‘హబీబ్’. చివరకు ఆఫ్ఘనిస్థాన్ సైన్యం, మరికొంత మంది సాధారణ ప్రజల సహకారంతో ఆర్మీ ఆఫీసర్ తన కొడుకుతో పాటు అక్కడున్న ఇతర పిల్లల ఆచూకీని కనిపెడతాడు. ఉగ్ర చెర నుంచి ఆ పిల్లల ప్రాణాలను కాపాడటమే కాదు.. వారికి స్వేచ్ఛను కలిగిస్తాడు మన ఆర్మీ ఆఫీసర్’’ అని అన్నారు.
దర్శకురాలు జెన్నీఫర్ అల్ఫోన్స్ మాట్లాడుతూ, ”నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఇవాళ తీవ్రవాద సంస్థల కారణంగా చిన్నపిల్లల బాల్యం దోపిడీకి గురవుతోంది. అలాంటి నీచమైన పనిని అంతం చేయించాలనే ఉద్దేశంతో నిజాయతీగా చేస్తున్న చిన్న ప్రయత్నమిది” అని చెప్పారు. ఈ చిత్రానికి జయఫణి కృష్ణ సంగీతం అందిస్తున్నారు.
Also Read
- Saira Banu First Look: ముస్లిం అమ్మాయిని ప్రేమించే యువకుడిగా ఆది.. ఆకట్టుకుంటున్న ‘సైరాబాను’ ఫస్ట్ లుక్..
- Sridevi Biography: శ్రీదేవి బయోగ్రఫీని లాంచ్ చేసిన ప్రియాంక .. 300 సినిమాల ప్రయాణం, 150 అరుదైన ఫోటోలతో ‘ఎంప్రెస్’!
- Bhargav BV: కన్నడ సుప్రీమ్ స్టార్ కొత్త ప్రయాణం… క్లాసిక్ టైటిల్‌తో హీరోగా, దర్శకుడిగా తెలుగు సినిమా
- Unmadam OTT Release: మర్డర్ కేసు వెనుక ముచ్చెమటలు పట్టించే మైండ్ గేమ్స్!.. ఓటీటీలోకి మరో మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్..


తాజావార్తలు
-
India Test Cricket History: 94 ఏళ్ల టెస్ట్ ప్రయాణం.. 600వ మ్యాచ్‌కు చేరుకున్న టీమిండియా చరిత్ర ఇదే..!
-
Mahindra BE 6 SPORTEQ: మహీంద్రా BE6 స్పోర్టెక్ ఎలక్ట్రిక్ SUV విడుదల.. 683KM రేంజ్, Gemini AIతో అదిరిపోయే ఫీచర్లు
-
Saira Banu First Look: ముస్లిం అమ్మాయిని ప్రేమించే యువకుడిగా ఆది.. ఆకట్టుకుంటున్న ‘సైరాబాను’ ఫస్ట్ లుక్..
-
Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు బ్రేక్..! హిట్‌మ్యాన్‌కు మరో అవకాశం
-
Team India: బ్రిటీషర్ల గడ్డపై స్వాతంత్య్ర దినోత్సవం.. లండన్‌లో జెండా ఎగరేసిన విరాట్ కోహ్లీ.. గుర్తుందా?
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!