Rao Bahadur: ‘నా ప్రతి క్యారెక్టర్‌తో నేను సహజీవనం చేస్తా’.. ప్రెస్ మీట్ లో సత్యదేవ్ మాటల తూటాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rao Bahadur: వెర్సటైల్ నటుడు సత్యదేవ్, దర్శకుడు వెంకటేష్ మహా కాంబినేషన్లో రూపొందిన సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’ జూలై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రయోగాత్మక కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే మంచి స్పందనను అందుకుంది. తొలి రోజే రూ.3.11 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. పాజిటివ్ టాక్ తో ఈ సినిమా మరింత జోష్ తో మందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన సక్సెస్ మీట్లో హీరో సత్యదేవ్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ విజయోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన సత్యదేవ్ తొలుత “సహజీవనం నాకు కొత్త కాదు” అని చెప్పడంతో ఒక్కసారిగా సభలో ఆశ్చర్య వాతావరణం నెలకొంది. అనంతరం ఆయన వెంటనే ఆ వ్యాఖ్యకు వివరణ ఇస్తూ, అది తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కాదని స్పష్టం చేశారు. ఒక నటుడిగా తాను పోషించే ప్రతి పాత్రతో మానసికంగా పూర్తిగా మమేకమై జీవిస్తానని, ఆ పాత్ర తనలోనే కొనసాగుతుందని వివరించారు. అందుకే ప్రతి క్యారెక్టర్‌తో తాను సహజీవనం చేస్తానని తెలిపారు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమాలో సత్యదేవ్ పోషించిన భువనరామప్ప రావు బహదూర్ పాత్ర ఆయన కెరీర్లోనే అత్యంత క్లిష్టమైన పాత్రల్లో ఒకటిగా నిలిచింది. 1968 నుంచి 1991 వరకు సాగే కథలో యువకుడి నుంచి లివర్ క్యాన్సర్ చివరి దశలో ఉన్న వృద్ధుడి వరకు విభిన్న దశల్లో కనిపిస్తూ ఆయన పూర్తిగా పాత్రలో లీనమయ్యారు. ఒకే గదిలో ఎక్కువ భాగం సాగే ఈ సైకలాజికల్ డ్రామాలో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఆ పాత్ర ప్రభావం నుంచి బయటపడేందుకు తనకు కొంత సమయం పట్టిందని సత్యదేవ్ కూడా వెల్లడించారు.
Also Read
- Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’ ఒరిజినల్ కాన్సెప్ట్ బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజ్!
- Vrushakarma : నాగవంశీ అవుట్.. దిల్ రాజు ఇన్..'వృషకర్మ' వెనుక అసలేం జరిగింది?
- Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
- Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, దీపా థామస్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా తెలుగు సినిమాకు కొత్త తరహా కథనాన్ని అందిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో సత్యదేవ్ చెప్పిన “సహజీవనం” మాట మాత్రం వైరల్ అవుతోంది. పూర్తి వీడియో చూడకుండా ఆ ఒక్క మాటను మాత్రమే వైరల్ చేయడంతో అపార్థాలు ఏర్పడినప్పటికీ, ఆయన ఇచ్చిన వివరణతో అసలు ఉద్దేశం ఏమిటో స్పష్టమైంది. ఒక నటుడు తన పాత్రతో ఎంతగా మమేకమవుతాడో చెప్పడానికి చేసిన ఈ పోలిక ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
“Disappointment isn’t new to me… Success is.”
That one line has found its perfect answer with the success of #RaoBahadur. ❤️🔥
Hard work always pays off, sooner or later. Once again, @ActorSatyaDev anna has proved it. 🙌❤️
A truly well-deserved success! 🔥 pic.twitter.com/ArhxUe77B4
— 𝗠𝗮𝗻𝗼𝗵𝗔𝗔𝗿 🐎🗡️ (@Fire__brAAnd) July 4, 2026
- Tags
- 'Rao Bahadur'
- cinema
తాజావార్తలు
-
Arnab Cyclone Damages: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. రాష్ట్రవ్యాప్తంగా 126.165 కి.మీ. రహదారులు ధ్వంసం
-
Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’ ఒరిజినల్ కాన్సెప్ట్ బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజ్!
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కోనసీమలో 6 వేల విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. జనజీవనం అస్తవ్యస్తం!
-
Vespa Vibe 125, Vibe 150: Vespa Vibe 125, Vibe 150 లాంచ్.. కొత్త కలర్స్, 5-ఇంచెస్ TFT డిస్ప్లే, ABS ఫీచర్లు!
ట్రెండింగ్
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!