Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Sarkaru Vari Paata Trailer Record

Trailer : రికార్డు స్థాయిలో సర్కారు వారి పాట..!

Published Date :May 4, 2022 , 5:18 pm
By Subbarao N
Trailer : రికార్డు స్థాయిలో సర్కారు వారి పాట..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మరో వారం రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు థియేటర్లో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. ‘సర్కారు వారి పాట’ మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్‌ 24 గంటల్లో టాలీవుడ్‌లో అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. 24 గంటల్లో 27 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టింది. అలాగే 1.2 మిలియన్స్‌కు పైగా లైక్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం యూ ట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది సర్కారు వారి పాట ట్రైలర్. ఇక తాజాగా ఈ సినిమా యూఎస్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతుంది. ఎన్నడు లేని విధంగా యూఎస్‌లో రికార్డు స్థాయిలో 603 లోకేషన్స్‌లో విడుదల చేయబోతున్నారు. ప్యాన్ ఇండియా సినిమాలు తప్పితే.. ఓ తెలుగు సినిమా ఈ రేంజ్‌లో.. ఇన్ని లోకేషన్స్‌లో విడుదల కావడం ఇదే ఫస్ట్ టైమ్. మహేష్ బాబు కెరీర్లోనే నెవర్ బిఫోర్ రిలీజ్‌గా.. సర్కారు వారి పాట నిలవబోతోంది. దాంతో ఈ సారి ఒవర్సీస్‌లో భారీ వసూళ్లు రాబట్టడం ఖాయమంటున్నారు.

ఇప్పటికే యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అక్కడ మే 11న ఈ సినిమా ప్రిమియర్స్‌ వేయబోతున్నారు. ఇక సర్కారు వారి పాట రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్ స్పీడ్ పెంచారు మేకర్స్‌. ఇప్పటికే దర్శకుడు పరుశురామ్, హీరోయిన్ కీర్తి సురేష్ సినిమా పై అంచనాలను పెంచేశారు. అలాగే ఈ నెల 7న భారీ ఎత్తున్న ప్రి రిలీజ్ బిజినెస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు గెస్ట్‌గా రాబోతున్నారని వినిపిస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్‌ చూసిన తర్వాత సర్కారు వారి పాట సాలిడ్ హిట్ కొట్టడం ఖాయమంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్‌కు విశేష స్పందన వస్తోంది. దాంతో త్వరలోనే మరో మాస్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్టు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చెబుతున్నారు. దాంతో సర్కారు వారి పాటపై అంచనాలు మిన్నంటాయి. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఆ తర్వాత రాజమౌళితో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు మహేష్ బాబు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • keerthy suresh
  • Parasuram
  • Sarkaru Vaari Paata
  • trailer record
  • YouTube Record

తాజావార్తలు

  • Donald Trump: మనలోనే ‘‘గూఢచారి’’ ఉన్నాడు.. మీడియాకు ట్రంప్ వార్నింగ్..

  • The Paradise: ‘ది ప్యారడైజ్’ రిలీజ్ విషయంలో నాని లెక్క మళ్ళి తప్పుతుందా?

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Artemis 2: 40 నిమిషాల పాటు భూమితో సంబంధాలు కోల్పోయిన ఆర్టెమిస్ 2.. కారణమిదే..

  • Astrology: ఏప్రిల్‌ 7, మంగళవారం దినఫలాలు..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions