Trending No 1: సర్కారు వారి పాట.. రికార్డుల వేట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహేష్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ సర్కారు వారి పాట రికార్డుల వేట మొదలైంది. ఈ సినిమా ట్రైలర్‌కు ఊహించని రీతిలో భారీ మాస్ రెస్పాన్స్ వస్తోంది. దాంతో ప్రస్తుతం సర్కారు వారి పాట ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. దూకుడు తరహా ఎంటర్ టైన్మెంట్, పోకిరి టైపు యాక్షన్ ఎపిసోడ్స్, ఒక్కడు రేంజ్ ఎలివేషన్లు.. ఇలా అన్నీ మిక్స్ చేసి.. ఫ్యాన్స్ కోరుకునే అంశాలు ఉండడంతో.. సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉండటం, కీర్తి సురేష్‌ని గ్లామరస్‌గా చూపించడం లాంటివి మరింత హైప్ పెంచేశాయి. దాంతో దర్శకుడు పరుశురామ్ ఫ్యామిలీ డైరెక్టర్ అనిపించుకున్నప్పటికీ.. మాస్ పల్స్ పట్టేశాడని అంటున్నారు నెటిజన్స్. సర్కారు వారి పాటను మంచి కమర్షియల్ ఎంటర్టైనర్లా తీర్చిదిద్ది ఉంటాడన్న అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే మహేష్ కామెడీ టైమింగ్.. తన మీద తనే సెటైర్స్ వేసుకోవడం.. తన మ్యానరిజం.. యాక్షన్ సీక్వెన్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రిలీజ్ అయిన గంటల్లోనే.. యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతు.. ట్రెండింగ్‌లో నెంబర్ 1 ప్లేస్‌కి వచ్చేసింది సర్కారు వారి పాట ట్రైలర్. 24 గంటలు గడవక ముందే.. ఫాస్టెస్ట్ 25 మిలియన్స్‌కి పైగా వ్యూస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే వన్ మిలియన్ కి పైగా లైక్స్ రావడంతో సర్కారు వారి పాట సంచలనంగా నిలిచింది. దాంతో 24 గంటల్లో ఈ ట్రైలర్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిందని అంటున్నారు. ఇక ఈ రెస్పాన్స్ చూసిన తర్వాత.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. సర్కారు వారి పాటకు అన్నీ భలేగా కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. భీమ్లా నాయక్.. ట్రిపుల్ ఆర్.. తర్వాత వచ్చిన సినిమాల్లో డబ్బింగ్ సినిమా కెజియఫ్ టు మినహాయిస్తే.. మిగతా సినిమాలు అలరించలేకపోయాయి. రీసెంట్గా రిలీజ్ అయిన ఆచార్య కూడా అంతంత మాత్రంగానే నిలిచేలా ఉంది. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, అలాగే మహేష్ అభిమానులు.. అందరూ చూడాలనుకునే కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది సర్కారు వారి పాట. దాంతో మే 12న రాబోతున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేయడం పక్కా అంటున్నారు. మరి అంచనాలను పెంచేసిన సర్కారు వారి పాట ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
- Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్ బచ్చన్ మెగా ప్లాన్ ? రూ.100 కోట్లతో బిగ్ బీ ఏం చేశారో తెలుసా!
- Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
- Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్‌కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
- Kallu Mama Song: 28 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. అండర్‌వరల్డ్ యాంథమ్‌గా నిలిచిన 'కల్లు మామ' పాట
తాజావార్తలు
-
Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
-
JD Vance-Iran: జేడీ వాన్స్‌కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
-
Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్ బచ్చన్ మెగా ప్లాన్ ? రూ.100 కోట్లతో బిగ్ బీ ఏం చేశారో తెలుసా!
-
YS Jagan: పార్లమెంట్ వ్యూహాలపై వైసీపీ భేటీ.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం.. సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు..
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!