NTV Telugu Site icon

Nani : పాపం నాని… ఎంతెంత ఎగిరినా అంతంతే

2

2

హీరో నాని సినిమాలకి ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయిపోతారు. దానికి కారణం నాని నటన మాత్రమే కాదు ఆయన ఎంచుకునే సినిమాలు కూడా చాలా నేచురల్ గా ఉంటాయి.అయితే ఇలా ఒక హీరో సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కనెక్ట్ అయిపోవడం అంటే చిన్న విషయం కాదు, అలాంటి అదృష్టం నానిని వరించింది. కానీ గత కొన్ని సినిమాల నుండి నాని ఎంచుకునే సినిమాల తీరు పూర్తిగా మారిపోయింది. ఎందుకో తెలియదు కానీ యాక్షన్ పై విపరీతమైన ఇష్టం అని మాత్రం తెలుస్తుంది. దసరా,రీసెంట్ గా వచ్చిన సరిపోదా శనివారం రెండు సినిమాల్లో కూడా పూర్తిగా యాక్షన్ హీరోలా తన టింజ్ ఉండేలా చూసుకున్నాడు.

ఇందులో ఎలాంటి తప్పులేదు.ఒక్కొక్కరి అభిరుచి ఒకలా ఉంటుంది. ఇక అతను ఒక సినిమాని ప్రమోట్ చేసే తీరు కూడా చాలా అద్భుతం. కేవలం తెలుగులోనే కాకుండా ఇండియా అంతటా తిరుగుతూ ప్రమోషన్స్ తో అదరగొట్టాడు.పాన్ ఇండియా సినిమా అంటే ఐదు లాంగ్వేజ్ లో సినిమా రిలీజ్ చెయ్యడం కాదు, రిలీజ్ అయ్యే ప్రతి చోట ప్రమోషన్స్ చేయాలని ఒక కొత్త వరవడి క్రియేట్ చేశాడు. కాకపోతే దురదృష్టం ఏంటంటే నాని ఎంచుకునే కథలు పాన్ ఇండియా అప్పీలింగ్ రేంజ్ లో ఉన్నాయా లేదా అని చూసుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. అందుకే దసరా తెలుగులో హిట్ అయినా మిగతా చోట్ల చాలా తక్కువ కలెక్షన్స్ దక్కించుకుంది. ఇక హాయ్ నాన్న సినిమా అయితే దసరా కంటే కూడా తక్కువ కలెక్షన్స్ నమోదు చేసింది. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడిలా మూడో సినిమా సరిపోదా శనివారాన్ని కూడా విపరీతంగా ప్రమోట్ చేశాడు నాని.

కానీ రిజల్ట్ మాత్రం రిపీట్ అయింది తప్ప ఫేట్ మారలేదు.పైగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యే సినిమాలకు ఒకే పేరు ఉండాలి అని అనేక హిట్ సినిమాలు ప్రూవ్ చేసిన గోల్డెన్ రూల్ ని కూడా పక్కనబెట్టి ఈ surya’s saturday అనే పేరు పెట్టారు.అది కూడా పాన్ ఇండియా మార్కెట్ లో ఈ సినిమా ఫలితం పై ప్రభావం చూపించింది అనుకోవాలి.

తనకి ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులు పట్టం కట్టిన ఫ్యామిలీ జోనర్ లో సంవత్సరానికి మూడు సినిమాలు తీసినా కూడా మినిమం గ్యారెంటీ హిట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.కానీ అలా కాకుండా యాక్షన్ అంటూ పైగా పాన్ ఇండియా మూవీ అంటూ ఇలా పరుగులెత్తడం దేనికి అని చాలామంది సినీ ప్రేమికులు సోషల్ మీడియా సాక్షిగా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరి నాని ఇకనైనా మారతాడా లేక పాన్ ఇండియా రేంజ్ లో తన యాక్షన్ తడాఖా చూపిస్తా అంటూ ముందుకెళ్తాడా అనేది ఆసక్తికరమైన అంశం.

ఇక ఇప్పుడు రాబోతుంది కూడా పోలీస్ సినిమా కాబట్టి, నాని ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు కాబట్టి, అది కూడా ఒక యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండే పాన్ ఇండియా మూవీ అయి ఉంటుంది. మూడుసార్లు ఏదో అద్భుతం చేద్దాం అనుకుని రీజినల్ ఆడియన్స్ ని మాత్రమే అలరించగలిగిన నాని ఈసారి పెన్ ఇండియా రేంజ్ లో పాస్ అవుతాడేమో చూడాలి.

Show comments