Sarangapani Jathakam : సారంగపాణి జాతకం సమ్మర్ లో తెలుస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన సినిమా ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించారు. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో సినిమా ‘సారంగపాణి జాతకం’. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ కు మంచి ఆదరణ లభించింది.
జాతకాలను బాగా నమ్ముతూ ‘మన జీవితం మొత్తం మన చేతిలోనే రాసి ఉంటుంది’ అని భావించే హీరో ప్రతిరోజూ ఉదయం పేపర్ చూసి అందులో రాసింది నిజం అవుతుందని నమ్మడమే కాదు, నిజమైన రోజు చుట్టుపక్కల ఎవరున్నారు, ఏం అవుతుంది, అనేది పట్టించుకోకుండా తన సంతోషాన్ని అందరి ముందు వ్యక్తం చేస్తూ జాతకాలపై అమితమైన నమ్మకం వల్ల అతని జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయి వంటి కథాంశాలతో రానుంది సారంగపాణి జాతకం. వాస్తవానికి ఈ తొలుత డిసెంబర్ 20న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ట్రైలర్ రిలీజ్ లో పేర్కొన్నారు మేకర్స్. కానీ పుష్ప కారణంగా వాయిదా వేసిన సినిమాలతో పాటు సారంగపాణి కూడా వాయిదా వేశారు మేకర్స్. ఆ తర్వాత జనవరి 26న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేయగా అక్కడ కూడా వీలుపడలేదు. ఇక తాజాగా ఈ సినిమాను సమ్మర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన సినిమా వేసవి కానుకగా వస్తుందో మళ్ళి అక్కడ కూడా వెనక్కి వెళుతుందో లేదో రానున్న రోజుల్లో తెలుస్తుంది.
Also Read
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో 'రష్మిక మందన్న'
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..
-
Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
-
SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!