Site icon NTV Telugu

Couple Friendly: కపుల్ ఫ్రెండ్లీనా.. ఇదేదో తేడాగా ఉంది మాస్టారూ?

Couple Friendly

Couple Friendly

Couple Friendly: సంతోష్ శోభన్ ఈయన గురించి ప్రత్యేకంగ చెప్పాలిసిన పని లేదు. 2011లో గోల్కొండ హైస్కూల్ చిత్రం ద్వారా బాలనటుడిగా సినిమారంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. దాని తరువాత వరుస సినిమాలు తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతను హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ సమర్పణలో “కపుల్ ఫ్రెండ్లీ” అనే మూవీ చేస్తున్నారు. ఈ రోజు హీరో సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్ తెలియజేస్తూ స్పెషల్ గ్లింప్స్ తో పాటు ఈ సినిమా టైటిల్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రంలో మిస్ ఇండియా మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read: Bharateeyudu 2: విజయ్ మాల్యా, గాలి జనార్దన్ రెడ్డిలను టచ్ చేసిన శంకర్?

లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. “కపుల్ ఫ్రెండ్లీ” టైటిల్ లుక్ లో చెన్నై సెంట్రల్ స్టేషన్ దగ్గరలోని ఓ రెసిడెన్షియల్ ఏరియాను చూపించారు. చెన్నై బ్యాక్ డ్రాప్ లో సాగే ఇంట్రెస్టింగ్ మూవీగా “కపుల్ ఫ్రెండ్లీ” ఉండబోతోంది. అలానే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య రవీంద్రన్ తన స్వరాలు అందించగా సినిమాటోగ్రఫీ – దినేష్ పురుషోత్తమన్ వ్యవహరిస్తున్నారు.

Exit mobile version