Anni Manchi Sekunamule: అమ్మ నన్ను నమ్మింది కాబట్టి సినిమాలు చేస్తున్నా : సంతోష్ శోభన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Santhosh Sobhan : సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందినీ రెడ్డి తెరకెక్కించిన సినిమా ‘ అన్నీ మంచి శకునములే’. ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కాబోతున్న సందర్భంగా సంతోష్ శోభన్ విలేకరులతో తన కెరీర్ గురించి ముచ్చటించాడు. తొలుత మూవీ గురించి చెబుతూ ”నాకు అడ్వాన్స్ చెక్ 2018 లో ఇచ్చింది ప్రియాంక దత్ గారే. ‘పేపర్‌బాయ్’ చిత్రం తర్వాత 5 ఏళ్ళ గ్యాప్ తర్వాత సరైన కథ, సరైన టైమ్ లో వచ్చింది అనుకున్నాను. నందినిరెడ్డి గారు స్వప్న గారు నన్ను ఆడిషన్ లో ఎంపిక చేశారు. ఆరోజు నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చారు. నేను వారిని కలవడం అనేది చాలా సంతోషంగా ఫీలయ్యాను. ఈ సినిమాలో నేను, షావుకారు జానకీ గారు డార్లింగ్ అని పిలుచుకుంటాం. ఇలాంటి పాత్ర చేసే అవకాశం యూత్ లో నాకే వచ్చింది అనుకుంటున్నాను. తను చాలా ఫ్రెండ్లీ గా ఉంటారు. సీనియర్ గా ఆమె నటనానుభవాలను షేర్ చేసుకున్నారు. ఇక అక్కంటే మా వాసుకి లా ఉండాలి అనిపించింది. ఆమె సూపర్. ‘తొలిప్రేమ’ సినిమా చూశాక వాసుకి లాంటి చెల్లెలు వుంటే బాగుంటుంది అనిపించింది. ఈ సినిమాలో అక్కంటే ఇలాగే ఉండాలి అనిపిస్తుంది. ఎమోషన్స్, లైటర్ వే లో సీన్స్ చాలా అద్భుతంగా చేసింది. ఆమెతో ఇంకా కలిసి సినిమాలు చేయాలనిపించింది” అని చెప్పారు.
ఐఎంఎఫ్ ప్రకారం 2028లో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
నందినీ రెడ్డి గురించి చెబుతూ, ”నందినిరెడ్డి గారితో పనిచేయడం ఎట్రాక్ట్ చేసింది. ”ఖుషి, తొలిప్రేమ” సినిమాలు చూశాక పవన్ కళ్యాణ్ గారి నటన బోనిఫైడ్ రొంమ్ కామ్ లా అనిపిస్తుంది. అలాగే నాకూ నందినిరెడ్డి గారి ‘అలా మొదలైంది’ చూశాక అనిపించింది. అప్పటినుండి ఆమెతో సినిమా చేయాలనుకున్నా. ఇప్పటికి కుదిరింది. ఈ సినిమాలో చాలా మ్యాజిక్ జరిగింది. నాకు అవకాశం రావడం అదృష్టమే. నా కెరీర్ లో ఇలాంటి కథకానీ, ఇంతమంది నటీనటుల కాంబినేషన్ లో భాగమయ్యే అవకాశం రాదేమోనని అనుకుంటున్నా. నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ కథ, వెండితెరపై చూడాల్సిన సినిమా ఇది. ఆ ఫీలింగ్ సినిమా చేసేటప్పుడు అనిపించింది. ఈ సినిమా టైటిల్ వినగానే చాలా నిజాయితీగా తీసే సినిమా అనిపించింది. ఇటీవలే ఈ సినిమాను ఎటవంటి బీజియమ్ లేకుండా చూశాను. బయటకు వచ్చాక చాలా తేలిగ్గా హాయిగా అనిపించింది. అదే శుభ శకునం నాకు” అని అన్నారు.
Highest temperature: 3 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు.. ఈ మండలాలకు వార్నింగ్..
నిర్మాణ సంస్థ గురించి చెబుతూ, ”అశ్వనీదత్‌గారి 50 ఏళ్ళ కెరీర్ బేనర్ లో నేను చేయడం చాలా ఆనందంగా వుంది. నాన్నగారు అప్పట్లో వారి బేనర్ లో ఓ సినిమా చేశారు. నేను కూడా వారి బేనర్ లో చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. స్వప్న సినిమాస్, వైజయంతీ మూవీస్ లో పనిచేయడం లక్క్ గా ఫీలవుతున్నాను” అని అన్నారు. మదర్స్ డే సందర్భంగా ఆమ్మ తో ఉన్న అనుబంధం గురించి చెబుతూ , ”మొన్న ఓ టీవీ షోలో కూడా అమ్మగారి గురించి అడిగారు. మాటలు రాలేదు. నటుడిగా సినిమాలు చేయడం ఆమెకు చాలా హ్యాపీగా వుంది. మొదట్లో నటుడిగా చాలా కాలం గేప్ తర్వాత కూడా అమ్మ ఇచ్చిన ధైర్యం మర్చిపోలేనిది. ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థల్లో అవకాశాలు రావడం చెప్పలేని ఆనందం. అమ్మ నన్ను నమ్మింది కాబట్టి సినిమాలు చేయగలుగుతున్నాను” అని అన్నారు.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!