చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ సంగీత విద్వాంసుడు పండిట్ శివకుమార్ శర్మ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన మంగళవారం గుండెపోటుతో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో సంగీత ప్రపంచంలో విషాద ఛాయలు అలముకున్నాయి. జమ్మూలో పుట్టిన ఆయన చిన్నతనం నుంచే సంగీతంపై ఇష్టంతో కష్టపడి నేర్చుకొని ఆ రాష్ట్రం నుంచి తొలి జానపద వాయిద్యకారుడిగా గుర్తింపు కూడా దక్కించుకున్నారు.
కాశ్మీర్‌లో జానపద సంగీతాన్ని వాయించడానికి ఎక్కువగా ఉపయోగించే వాయిద్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చి, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని ప్లే చేయడానికి సంతూర్‌ని ఉపయోగించినందుకు గుర్తింపు పొందారు. ఇక బాలీవుడ్ పలు చిత్రాలకు పనిచేశారు. శివ- హరి ద్వయం పేరుతో మ్యూజిక్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందిన వాళ్లలో ఒకరే ఈయన. ‘జనక్ జనక్ పాయల్ బాజే’ అనే చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ గా తొలిసారి అడుగుపెట్టి, పలు చిత్రాలకు ఏంతో మంచి మ్యూజిక్ ని అందించారు. ఇక ఈయన మరణవార్త విని అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ప్రధాని మోడీ సైతం ఆయన మృతివార్త తెలిసి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.