చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ సంగీత విద్వాంసుడు పండిట్ శివకుమార్ శర్మ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన మంగళవారం గుండెపోటుతో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో సంగీత ప్రపంచంలో విషాద ఛాయలు అలముకున్నాయి. జమ్మూలో పుట్టిన ఆయన చిన్నతనం నుంచే సంగీతంపై ఇష్టంతో కష్టపడి నేర్చుకొని ఆ రాష్ట్రం నుంచి తొలి జానపద వాయిద్యకారుడిగా గుర్తింపు కూడా దక్కించుకున్నారు. కాశ్మీర్‌లో జానపద సంగీతాన్ని వాయించడానికి ఎక్కువగా ఉపయోగించే…