Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ చరిత్రని మార్చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఈ సినిమా తర్వాత ఓవర్ నైట్ లోనే సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక ఇదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం యానిమల్. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ మరియు పి సిరీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్, ట్రైలర్ . సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఇక యానిమల్ సినిమాకు డైరెక్షన్ తో పాటు సందీప్ ఎడిటర్ గా కూడా వర్క్ చేశాడు.
Bandi Ramesh: చేసిన అభివృద్ధి ఏంటి?.. ఎమ్మెల్యేను ప్రశ్నించిన బండి రమేష్
ఇక ఆ విషయం గురించి సందీప్ చెప్పుకొచ్చాడు. యానిమల్ చిత్రానికి ఎడిటర్ గా కూడా చేయానికి కారణం ఏంటి అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సందీప్ మాట్లాడుతూ.. ” నేను ఎడిటింగ్ చేస్తా. నాకు ఎడిటింగ్ చాలా ఇష్టం. నిజానికి అది చాలా కష్టమైన పని. అయితే నా సినిమా నా కంటే ఎక్కువగా ఎవరికీ అర్ధం కాదనేది నా భావన. అయితే ఇంకా బెటర్ గా చేసే వాళ్ళు వుంటే ఖచ్చితంగా ఇచ్చేస్తా. అలా అయితే నాకు చాలా సమయం కూడా కలిసొస్తుంది” అని చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
