టాలీవుడ్‌లో తనదైన స్టైల్, అగ్రెసివ్ మేకింగ్, స్ట్రైట్‌ఫార్వర్డ్ అటిట్యూడ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. కేవలం మూడు సినిమాలతోనే బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నాడు. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో కల్ట్ హిట్ అందుకున్న సందీప్, అదే కథను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి బాలీవుడ్‌లో కూడా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. అనంతరం రణ్‌బీర్ కపూర్‌తో చేసిన యానిమల్ సినిమా ఇండియన్ సినీ హిస్టరీలో రికార్డులు తిరగరాసింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే భారీ యాక్షన్ డ్రామాను పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక సినిమా షూటింగ్ సమయంలో ఏ అభిప్రాయమైనా నేరుగా చెప్పే సందీప్‌కు “రూడ్ డైరెక్టర్” అనే ఇమేజ్ ఉంది. కానీ అతని మరో వైపు సహాయం చేయడంలో వెనుకాడని మనసున్న వ్యక్తి అని తాజాగా వెలుగులోకి వచ్చింది.
Also Read : Kantara : కాంతార టీమ్‌లో వరుస మరణాలపై స్పందించిన నిర్మాత..
‘ఫిదా’ సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్‌గా నటించిన గాయత్రి గుప్త ఇటీవల ఆటోఇమ్యూన్ డిసీజ్ బారిన పడ్డారు. ట్రీట్మెంట్ కోసం ఉన్న మొత్తం ఖర్చు అయిపోయి, అద్దె కట్టుకునే డబ్బు కూడా లేక ఇబ్బందుల్లో ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సమయంలో తనకు మంచి ఫ్రెండ్ అయిన సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ పెట్టి తన పరిస్థితి వివరించిందట
దానికి స్పందించిన సందీప్, రిపోర్ట్స్ పంపమని అడిగి, మొత్తం మూడు నెలల చికిత్స ఖర్చు ఎంత అవుతుందో తెలుసుకున్నారు. రిపోర్ట్స్ పరిశీలించిన వారం రోజుల్లోనే ఆయన తన ఖాతా నుంచి రూ.5.5 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశారట. ఈ విషయాని గాయత్రి స్వయంగా ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించడంతో, సోషల్ మీడియాలో సందీప్ రెడ్డి వంగా హెల్పింగ్ నేచర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రికార్డులు బ్రేక్ చేసే దర్శకుడిగా మాత్రమే కాకుండా, అవసరంలో ఉన్నవారికి అండగా నిలిచే హ్యూమన్ బీయింగ్‌గా కూడా ఆయన ఇమేజ్ మరింత పెరిగిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.