Sandeep Reddy Vanga: జావేద్ అక్తర్ కి ఇచ్చి పడేశాడు.. నన్ను అనే ముందు నీ కొడుకు చేసిన మీర్జాపూర్ చూడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sandeep Reddy Vanga Counter to Javed Akhtar’s Animal comments: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన ‘యానిమల్’ సినిమాలో రణబీర్ కపూర్ పోషించిన రణ్ విజయ్ పాత్ర విషపూరితమైన పురుషత్వాన్ని ప్రేరేకిస్తోంది అంటూ చాలా విమర్శలు వచ్చాయి. రచయిత జావేద్ అక్తర్ సైతం ఇలాంటి సినిమాలను ప్రమాదకరం అని అన్నారు. అయితే తాజాగా ఈ కామెంట్స్ మీద సందీప్ ప్రతిస్పందిస్తూ, అక్తర్ తన సినిమాపై వేళ్లు చూపించే ముందు తన కొడుకు ఫర్హాన్ అక్తర్ చేసే కంటెంట్ ను కూడా పర్యవేక్షించాలని కోరారు. సిద్ధార్థ్ కన్నన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, సందీప్ మాట్లాడుతూ, “ఆయన సినిమా చూడలేదని చాలా స్పష్టంగా ఉంది. ఆ కామెంట్లో తను సినిమా మొత్తం చూడలేదని చాలా క్లియర్‌గా ఉంది. ఇప్పుడు ఎవరైనా సినిమా చూడకుండా మాట్లాడితే వారి గురించి ఏం చెప్పాలి? ఆయన సినిమా చూడలేదు, ఆయన మాత్రమే కాదు, ఒక కళాఖండంపై రాళ్ళు విసురుతున్న ఎవరైనా, వారు ముందుగా తమ పరిసరాలను ఎందుకు తనిఖీ చేసుకోరు అని సందీప్ ప్రశ్నించాడు.
Also Read
మీర్జాపూర్‌ని నిర్మిస్తున్నప్పుడు అదే విషయాన్ని తన కుమారుడు ఫర్హాన్ అక్తర్‌కి ఎందుకు చెప్పలేదు.? అని ఆయన ప్రశ్నించారు. ప్రపంచంలో ఉన్న బూతులు అన్నీ మీర్జాపూర్ లోనే ఉన్నాయి, ఆ దెబ్బకు నేను మొత్తం షో కూడా చూడలేదు. ఆ షో తెలుగులోకి అనువదించబడినప్పుడు, మీరు దానిని చూస్తుంటే, మీకు బూతులతో పుక్కిలించినట్లు అనిపిస్తుంది. అతను తన కొడుకు పనిని ఎందుకు చెక్ చేయడం లేదు? అని సందీప్ ప్రశ్నించారు. జావేద్ అక్తర్ ఇటీవల యానిమల్ సినిమా గురించి మాట్లాడుతో ” ఒక పురుషుడు స్త్రీని తన షూ నాకమని లేదా ఒక వ్యక్తి స్త్రీని చెంపదెబ్బ కొట్టడానికి ఓకే చెప్పినా ఆ సినిమా సూపర్ హిట్ అయితే అది ప్రమాదకరం అని అన్నారు. ఆ వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తూ సందీప్ ఈమేరకు కామెంట్లు చేశాడు.
తాజావార్తలు
-
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
-
Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
-
Karuppu : వీరవిహారం చేస్తున్న వీరభద్రుడు.. వర్కింగ్ డే రోజు భారీ వసూళ్లు
-
Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్‌కు ముప్పు తప్పదా..?
-
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!