NTV Telugu Site icon

Spirit : సందీప్ రెడ్డి స్పెషల్ కండిషన్స్.. ప్రభాస్ గ్రీన్ సిగ్నల్!?

Spirit

Spirit

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే  ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ స్టార్ట్ చేసాడు సుందీప్ రెడ్డి. ఇటీవల కాస్టింగ్ కాల్ ప్రకటించగా కొత్త నటీ నటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. మొత్తంగా సమ్మర్‌లోనే స్పిరిట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సందీప్‌ రెడ్డి హీరో ప్రభాస్‌కు కొన్ని కండిషన్స్ పెట్టగా అందుకు డార్లింగ్ కూడా అందుకు ఓకె చెప్పినట్టుగా సమాచారం.
Also Read : Kayadu : విశ్వక్ సేన్ తో రొమాన్స్ చేయబోతున్న’కయ్యదు లోహర్’

ఈ సినిమాలో ఫస్ట్ టైం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు ప్రభాస్. దీంతో ప్రభాస్ లుక్‌ రివీల్ కాకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు సందీప్. అందుకే. స్పిరిట్ మొదలు పెట్టిన తర్వాత పూర్తిగా ఈ సినిమా మీదే డార్లింగ్ ఫోకస్ ఉండేలా చూస్తున్నాడట. అలాగే ఈ ప్రాజెక్ట్ జరుగుతున్న సమయంలో మరో సినిమా చేయకూడదని షరతు విధించాడట. ప్రభాస్ కూడా స్పిరిట్‌ను చాలా స్పెషల్‌గా ట్రీట్ చేసేలా రెడీ అవుతున్నాడు. తన లుక్ లీక్ కాకూడదనే ఉద్దేశంతో సందీప్ పెట్టిన షరతులకు ఓకె చెప్పాడట. దీంతో స్వయంగా సందీప్ రెడ్డి రివీల్ చేసే వరకు స్పిరిట్ నుంచి ప్రభాస్ లుక్ బయటికొచ్చే ఛాన్స్ లేదు. అసలే సందీప్ హీరోలు చాలా వైల్డ్‌గా ఉంటారు.  రెబల్ స్టార్ ను ఏ రేంజ్ లో చూపిస్తాడోనని ఫ్యాన్స్ ఇప్పటినుండే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.