చేసింది తక్కువ సినిమాలే అయినా సంయుక్త మీనన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 
తాజాగా ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ మాంగళ్య షాపింగ్ మాల్ ను నార్సింగ్ మెయిన్ రోడ్డు హెచ్ పి పెట్రోల్ బంక్ పక్కన వైభవంగా ప్రారంభమైంది. 
ప్రముఖ హీరోయిన్ సంయుక్త మీనన్ చేతుల మీదుగా ఈ షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. 
పట్టు, ఫ్యాన్సీ, హై–ఫ్యాన్సీ, చుడీదార్స్, వెస్ట్రన్వేర్, మెన్స్ బ్రాండెడ్, కిడ్స్ వేర్, ఎథినిక్ వేర్లతో అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని ఇచ్చేలా భారీగా మాంగళ్య షాపింగ్ మాల్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. 
ఇక చీరకట్టులో సంయుక్త మెరుస్తూ కనిపిస్తోంది.

ఇక తెలుగులో మరిన్ని సినిమాలు చేసేందుకు ఆమె ప్రయత్నిస్తోంది.