Megastar Chiranjeevi: 36 ఏళ్ళయినా.. అదే తీరు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉలగనాయగన్ కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి కలుసుకోవడం నిజంగా విశేషమే. వారిద్దరూ ఎప్పుడు కలుసుకున్నా అభిమానులకు సంబరమే. ఇటీవల విడుదలైన కమల్ హాసన్ `విక్రమ్` చిత్రం థియేటర్లలో బాగానే సందడి చేస్తోంది. ఈ సందర్భంగా కమల్ హాసన్ ను, చిత్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌ను తన నివాసానికి ఆహ్వానించి మరీ సత్కరించారు చిరంజీవి. సిటీలోనే ఉన్న సల్మాన్ ఖాన్‌ను కూడా చిరంజీవి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పిక్చర్స్ తోపాటు 1986లో `స్వాతిముత్యం` శతదినోత్సవం సందర్భంగా కమల్, చిరంజీవితో ఉన్న రాజ్ కపూర్ ఫోటోను కూడా విడుదల చేసి 36 సంవత్సరాల క్రితం అప్పుడు రాజ్ కపూర్, ఇప్పుడు సల్మాన్ ఖాన్ అంటూ ఓ క్యాప్షన్ పెట్టి మరీ సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. చూసిన వారిలో చాలామంది రాజ్ కపూర్ తో సల్మాన్ ఖాన్ ను పోల్చినట్టయిందని అభిప్రాయపడ్డారు. రాజ్ కపూర్ ఎక్కడా, సల్మాన్ ఖాన్ ఎక్కడా అంటూ కామెంట్స్ వినిపించాయి. పైగా ఈ 36 సంవత్సరాలలో చిత్రసీమలో చోటు చేసుకున్న పరిణామాలెన్నో.
రాజ్ కపూర్ పాల్గొన్న `స్వాతిముత్యం` వేడుక నిఖార్సయిన విజయోత్సవం. ఆ సినిమా శతదినోత్సవం పూర్తి చేసుకొని 1986 బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలచింది. అది వంద రోజుల వేడుక. ఇప్పుడు `విక్రమ్`ది పదిరోజుల సంబరం. అప్పట్లో ఓ సినిమా హిట్ టాక్ వస్తే ఖచ్చితంగా అర్ధశతదినోత్సవమో, శతదినోత్సవమో, రజతోత్సవమో చూసేది. కానీ, ఇప్పుడు థియేటర్లలో సందడి ఉన్నంత వరకే సంబరాలు చేసుకొనే పరిస్థితి. ఈ 36 ఏళ్ళలో సినిమారంగంలో ఎన్నెన్నో మార్పులు చోటు చేసుకొని ఉండవచ్చు. కానీ, చిరంజీవి, కమల్ హాసన్ మధ్య స్నేహబంధంలో ఏలాంటి మార్పూ చోటు చేసుకోలేదు అనడానికి ఈ పిక్స్ నిదర్శనం. మిత్రుడు సాధించిన విజయానికి చిరంజీవి ఆనందిస్తూ వారిని ఇంటికి పిలిచి మరీ గౌరవించడం అన్న అంశాన్ని అందరూ అభినందిస్తున్నారు. తన చుట్టూ ఉన్న వారు ఎవరు విజయం సాధించినా, అభినందించడం చిరంజీవికి ఓ అలవాటు. అందులో భాగంగానే కమల్ హాసన్ ను సత్కరించారు. ఇక సల్మాన్ ఖాన్ కూడా ఇందులో పాల్గొనడం విశేషమే. చిరంజీవి నటిస్తోన్న `గాడ్ ఫాదర్`లో సల్మాన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
Also Read
- Faria :దళపతి విజయ్ వారసుడు 'ఫ్యూచర్ సీఎం' .. సంజయ్‌పై నటి ఫరియా అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
- Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
- Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
- Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ 'లవ్ అండ్ వార్' ఫస్ట్ లుక్ రిలీజ్

ఈ పిక్ చూసిన తరువాత చాలామందిలో కమల్ హాసన్, చిరంజీవి మళ్లీ కలసి నటిస్తారా అన్న ఆలోచన కూడా కలిగింది. తొలి రోజుల్లో చిరంజీవి, కమల్ హాసన్ తో కలసి `ఇది కథ కాదు` చిత్రంలో నటించారు. అప్పటి నుంచీ వారి మధ్య స్నేహబంధం కొనసాగుతూనే ఉంది. మరి ఇద్దరు మిత్రులు ఓ సినిమాలో కలసి నటిస్తే అభిమానులకు నయనానందం కలగకుండా ఉంటుందా?
తాజావార్తలు
-
SIR row: CEC జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం.!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Trump-Jinping: జిన్‌పింగ్‌కు ట్రంప్ దంపతులు స్వాగతం పలకడం వెనుక ఇంత మతలబు ఉందా?
-
Fuel Prices: రోజుకు రూ. 530 కోట్ల నష్టాల్లో ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
-
Faria :దళపతి విజయ్ వారసుడు ‘ఫ్యూచర్ సీఎం’ .. సంజయ్‌పై నటి ఫరియా అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!