G.V. Prakash Kumar : రహమాన్ కంటే ప్రకాశ్ రెండాకులు ఎక్కువే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
!
మేనల్లుడికి మేనమామ పోలికలు వస్తే పేరు ప్రఖ్యాతులు లభిస్తాయని అంటారు. సంగీత దర్శకుడు, నటుడు జి.వి. ప్రకాశ్ కుమార్ ను చూస్తే, ఆ నానుడి నిజమే అనిపిస్తుంది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్ అక్క రెహనా ఏకైక కుమారుడే ప్రకాశ్ కుమార్. రెహనా కూడా గాయని. తల్లి, మేనమామ బాటలోనే ఆరంభంలో ప్రకాశ్ గళం విప్పి పాటలు పాడేవాడు.
జి.వి. ప్రకాశ్ 1987 జూన్ 13న మద్రాసులో జన్మించాడు. మేనమామ స్వరకల్పన చేసిన పలు చిత్రాలలో ప్రకాశ్ కుమార్ గాత్రం వినిపించింది. రహమాన్ స్వరాలతోనే పలు విజయాలు చూసిన డైరెక్టర్ ఎస్.శంకర్ తన సొంత చిత్రం ‘వెయిల్’ ద్వారా జి.వి. ప్రకాశ్ కుమార్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేశారు. ఆ సినిమాలోని పాటలు యువతను ఆకట్టుకున్నాయి. దాంతో రహమాన్ బాణీలు కుదరని వారంతా జి.వి.ప్రకాశ్ స్వరాల వెంట పరుగులు తీశారు. తన దరికి చేరిన సినిమాలకు న్యాయం చేస్తూ పలు మ్యూజికల్ హిట్స్ అందించారు జి.వి.ప్రకాశ్. తెలుగులో కరుణాకరన్ రూపొందించిన ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రానికి జి.వి. ప్రకాశ్ కుమార్ స్వరకల్పన చేశాడు. ప్రభాస్ ‘డార్లింగ్’, రామ్ ‘ఎందుకంటే ప్రేమంట’ , ‘ఒంగోలు గిత్త’, శర్వానంద్ ‘రాజాధిరాజా’ , నాని ‘జెండాపై కపిరాజు’ చిత్రాలకు కూడా ప్రకాశ్ స్వరకల్పన చేసి అలరించారు. ఇవి కాకుండా తమిళంలో ప్రకాశ్ సంగీతం సమకూర్చిన చిత్రాలు తెలుగులోకి అనువాదమైనప్పుడు కూడా ఆయనే బాణీలు పలికించాడు. ఆ డబ్బింగ్ మూవీస్ తోనూ తెలుగువారిని ఆకట్టుకున్నాడు ప్రకాశ్.
Also Read
- Scene Movie: "హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది": సూర్య
- Dada: రక్తపాతం లేని రచ్చ.. బాలయ్య వర్సెస్ మనోజ్ ‘దాదా’ వార్!
- Sivakarthikeyan: డైరెక్టర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన హీరో.. సర్ప్రైజ్ మామూలుగా లేదుగా!
- Tollywood: ఒకే ఒక్క ఫ్లాప్.. ప్రశ్నార్థకంగా మారిన స్టార్ డైరెక్టర్ల భవిష్యత్తు!
మామకంటే రెండాకులు ఎక్కువే చదివాడు జి.వి.ప్రకాశ్ కుమార్. రహమాన్ సంగీత దర్శకునిగా, గాయకునిగా, గీత రచయితగా సాగితే, ప్రకాశ్ నటనలోనూ అడుగు పెట్టి ఆకట్టుకున్నాడు. రజనీకాంత్ ‘కథానాయకుడు’లో తొలిసారి తెరపై కనిపించిన ప్రకాశ్, తరువాత పలు చిత్రాలలో అతిథి పాత్రల్లో నటించాడు. ‘పెన్సిల్’ చిత్రంతో హీరో అయ్యాడు. కానీ, ఈ సినిమా విడుదలలో జాప్యం జరిగింది. తెలుగులో విజయం సాధించిన ‘ప్రేమకథా చిత్రం’ ఆధారంగా రూపొందిన ‘డార్లింగ్’లో తొలిసారి జనం ముందు హీరోగా కనిపించాడు ప్రకాశ్. ఆ సినిమా మంచి ఆదరణ పొందడంతో నటునిగానూ ప్రకాశ్ బిజీ అయిపోయాడు. “త్రిష ఇల్లనా నయనతార, ఎనక్కు ఇన్నొరు పేర్ ఇరుక్కుమ్, కడవుల్ ఇరుకాన్ కుమారు” వంటి చిత్రాలతో హీరోగానూ ప్రకాశ్ మంచి మార్కులు సంపాదించేశాడు. ప్రకాశ్ నటించిన ‘సెల్ఫీ’ ఈ యేడాది విడుదలై విజయం సాధించింది. స్వరకల్పన చేసి, జీవీ నటించిన ‘ఐంగరన్’ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.
మరో మూడు చిత్రాలలో ప్రస్తుతం నటిస్తున్నాడు ప్రకాశ్. వాటిలో ఓ ఇంగ్లిష్ మూవీ కూడా ఉండడం విశేషం. ఏదైనా అటు సంగీత దర్శకునిగా, ఇటు నటునిగా రాణిస్తున్న ప్రకాశ్ కుమార్ మునుముందు ఇంకా ఏ తీరున అలరిస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!