Samantha : స్టార్ హీరోయిన్ సమంత మరోసారి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆమె నిర్మాతగా మారి తీసిన లేటెస్ట్ మూవీ శుభం. ట్రా లా లా బ్యానర్ మీద ఆమె మంచి బడ్జెట్ తో దీన్ని నిర్మించింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. మొదటి నుంచి మూవీని భారీగా ప్రమోట్ చేస్తూ వస్తోంది సమంత. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను లైఫ్ లో సక్సెస్ అయినప్పుడు కంటే ఫెయిల్యూర్ నుంచే ఎక్కువ విషయాలు నేర్చుకున్నట్టు తెలిపింది. కెరీర్ మొదట్లోనే తనకు చాలా సక్సెస్ లు వచ్చాయని.. అప్పుడు తనను టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అని పిలిచేవారని గుర్తు చేసుకుంది.
Read Also : Anasuya : నడుము అందాలతో రెచ్చిపోయిన అనసూయ..
‘కెరీర్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. నేను కెరీర్ మొదట్లో వరుస సినిమాలు హిట్ అయినప్పుడు సంతోషించా. కానీ వాటి తర్వాత మళ్లీ ఫెయిల్యూర్స్ వచ్చాయి. అప్పుడే కెరీర్ లో చాలా విషయాలు నేర్చుకున్నాను. అవే నన్ను ఈ స్థాయి దాకా తెచ్చాయి. త్వరలోనే మా ఇంటి బంగారం సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నా. ఇక నుంచి ఐటెం సాంగ్స్ చేయాలనుకోవట్లేదు. ఊ అంటావా మావ పాట నాకు ఒక సవాల్. అనుకోకుండా వచ్చిన ఆఫర్ ను సవాల్ గా తీసుకుని చేశా. ఇక వాటిపై ఇంట్రెస్ట్ లేదు. మంచి కథలు, పాత్రలు చేయాలని ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
Read Also : IND PAK War: కాల్పుల విరమణకు అంగీకరించిన భారత్- పాకిస్థాన్.. ట్రంప్ స్పష్టం!