Yashoda Trailer: టాలీవుడ్ హీరోయిన్ సమంత చాలా గ్యాప్ తరువాత వెండితెరపై కనిపించనుంది. హరి- హరీష్ దర్శకత్వంలో సామ్ నటిస్తున్న చిత్రం యశోద. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను తెలుగులో విజయ్ దేవరకొండ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. నీకెప్పుడైనా రెండు గుండె చప్పుళ్ళు వినిపించాయా? బిడ్డను కడుపున మోస్తున్న తల్లికి మాత్రమే అది వినిపిస్తుంది.. అన్న సామ్ వాయిస్ తో ఈ ట్రైలర్ ప్రారంభమయ్యింది. పెళ్లి కానీ యువతులకు డబ్బు ఆశచూపి సరోగసీ ద్వారా బిడ్డలకు జన్మనిచ్చి వారిని ధనవంతులకు అమ్మేసే ఇవా అనే ఒక హాస్పిటల్ ను నడిపిస్తుంటుంది వరలక్ష్మీ శరత్ కుమార్.. అందులో డాక్టర్ ఉన్ని ముకుందన్ పనిచేస్తూ ఉంటాడు.
ఇక యశోద అనే యువతి డబ్బు కోసం సరోగసీ ద్వారా బిడ్డను కనడానికి రెడీ అవుతోంది. అయితే అక్కడి నుంచి ఆమెకు కష్టాలు మొదలవుతాయి. ఆ హాస్పిటల్ లో జరిగే ఒక పెద్ద మాఫియాను ఆమె కనిపెట్టడం, అందుకు ఆమెను చంపడానికి వారు ప్రయత్నించడం ట్రైలర్ లో కనిపిస్తోంది. ఈ మధ్యలో కడుపుల బిడ్డను కాపాడుకుంటూ ఆ మాఫియాను యశోద ఎలా అంతమొందించ్చింది అనేది కథగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో సరోగసీ గురించి వివాదాలు నడుస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా రావడం సినిమాకు ప్లస్ అనే చెప్పాలి. ఇక యశోద గా సామ్ పర్ఫెక్ట్ అని ట్రైలర్ ను బట్టే అర్ధమవుతోంది. విలన్ గా వరలక్ష్మీ, సామ్ ను ప్రేమించే డాక్టర్ గా ఉన్ని ముకుందన్ కనిపించాడు. సమాజంలో సరోగసీ తల్లులు ఎలా ఉంటారు.. వారు దేనికోసం అంత త్యాగాలను చేస్తున్నారు అనేది ఎమోషనల్ గా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ తోనే భాయ్ అంచనాలను పెంచేశారు డైరెక్టర్స్. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే నవంబర్ 11 వరకు ఆగాల్సిందే.