NTV Telugu Site icon

Samantha: నాగచైతన్య మీద ఇలా ఓపెన్ అయిపోయిందేంటి?

Samantha

Samantha

తాజాగా సినీనటి సమంత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి . ఆమె ఈ మధ్య సెటైల్ హనీ బన్నీ అనే సిరీస్ చేసింది. ఆ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా అనేక ఇంటర్వ్యూస్ ఇస్తోంది. ఇక ఈ ఇంటర్వ్యూ ఒక దానిలో భాగంగా సమంత వరుణ్ ధావన్ ఇద్దరు ఒక ఆసక్తికరమైన రాపిడ్ ఫైర్ లాంటి గేమ్ రౌండ్ ఆడుతూ కనిపించారు. ఈ సందర్భంగా వరుణ్ ధావన్ సమంతను మీకు ఏదైనా విషయం మీద అనవసరంగా ఖర్చు పెట్టాను అనిపించిందా అంటే వెంటనే ఆమె తడుముకోకుండా నా ఎక్స్ కి ఇచ్చిన ఎక్స్పెన్సివ్ గిఫ్టుల(ఖరీదైన బహుమతుల) విషయంలో అనవసరంగా ఖర్చు పెట్టానని అనిపించింది అంటూ కామెంట్ చేసింది. అయితే సమంత చేసిన వ్యాఖ్యల మీద ఇప్పుడు మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఈ విషయంలో సమంతకి అనుకూలంగా కామెంట్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా నాగచైతన్య బ్రేకప్ నుంచి ఆమె ఇంకా బయటకు వచ్చినట్లు కనిపించడం లేదని ఆయన మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో తన ఆవేదన ఇలా వ్యక్తం చేస్తోంది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

Also Read: Devi Sri Prasad: లైవ్ లో పుష్ప నిర్మాతలపై దేవిశ్రీప్రసాద్ అసహనం

మరికొంతమంది ఆమె విడాకుల తర్వాత ఎలాంటి భరణాన్ని ఆశించలేదు అలాంటప్పుడు నాగచైతన్య కోసం పెట్టిన ఖర్చు విషయంలో ఆమె కామెంట్ చేస్తే తప్పేంటి అని కామెంట్ చేస్తున్నారు. కొంతమంది ఆమె మీద జాలి చూపిస్తుంటే మరికొంతమంది ఆమె అడిగిన దాంట్లో తప్పేముంది అని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయని చెప్పక తప్పదు. అయితే మరికొంతమంది కామెంట్స్ ప్రకారం సమంత నాగచైతన్య గురించి మాట్లాడి ఉండకపోవచ్చు అని ఎందుకంటే నాగచైతన్య కంటే ముందే ఆమె ఒకరిద్దరి హీరోలతో ప్రేమాయణం నడిపినట్టు ప్రచారం జరిగింది కాబట్టి బహుశా వారి గురించి ఆమె ఇలా మాట్లాడి ఉండవచ్చని కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా సమంత ఇప్పుడు తన ఎక్స్ కి పెట్టిన ఖర్చు యూజ్లెస్ అని పేర్కొనడం మాత్రం సోషల్ మీడియాలో అలాగే మీడియాలో కూడా హాట్ టాపిక్ అవుతుంది అయితే ఆ ఎక్స్ ఎవరనే విషయం మీద మాత్రం పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

Show comments