Site icon NTV Telugu

Samantha and Vijay Deverakonda : రౌడీ హీరోతో సామ్ రొమాన్స్ ?

Samantha-and-vijay-devarako

రౌడీ హీరోతో సమంత రొమాన్స్ చేయబోతోందట. ‘మహానటి’లో కాసేపు తెరపై అలరించిన ఈ జంట మరోమారు పూర్తిస్థాయిలో తెరపై జంటగా సందడి చేయబోతున్నారట. యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనున్న. ఈ మూవీలో విజయ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీని తీసుకోవాలని మేకర్స్ ముందుగా భావించారు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండతో వెండితెర రొమాన్స్ కు సామ్ ఎంపికైందని సమాచారం. మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన ఈ రొమాంటిక్ డ్రామాలో సామ్ హీరోయిన్ గా నటించబోతోంది.

Read Also : Radhe Shyam on Metaverse : ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డు… యూనిక్ వెర్షన్ లో మూవీ

మేకర్స్ ఈ విషయంపై ఇంకా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు ఇవ్వలేదు. కానీ శివ నిర్వాణ హృదయాన్ని హత్తుకునే కథతో విజయ్ దేవరకొండ, సమంతను ఆకట్టుకున్నాడని, అందుకే స్టార్స్ ఇద్దరూ వెంటనే ఈ మూవీలో నటించడానికి అంగీకరించారు అని అంటున్నారు. విజయ్, శివ కాంబోలో వస్తున్న మొదటి చిత్రం ఇదే కాగా, సమంత మాత్రం ఇంతకుముందు ఆయన దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘మజిలీ’లో నటించింది. ఈ క్రేజీ కాంబోలో రూపొందుతున్న ప్రాజెక్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రానుంది.

Exit mobile version