సామ్ “పుష్ప” స్పెషల్ సాంగ్ ఎప్పుడు? ఎక్కడ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సమంత తన కెరీర్‌లో తొలిసారిగా ఓ స్పెషల్ సాంగ్‌లో రెచ్చిపోనుంది. ‘పుష్ప’ స్పెషల్ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో పాటు సామ్ బోల్డ్ లుక్ లో చిందేయనుంది. సుకుమార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కు కూడా ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆ సాంగ్ లో చేసేవారి క్రేజ్ మరింత పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి పూజాహెగ్డే ‘జిగేలు రాణి’గా మారడమే నిదర్శనం. కాగా సినిమా విడుదల దగ్గర పడుతోంది. ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని బన్నీ అభిమానులు ఆందోళన పడుతున్నారు. వారి ఆందోళనను దూరం చేసే తాజా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Read Also : “పుష్ప” ట్రైలర్ అప్డేట్… వైల్డెస్ట్ మాస్ ఫెస్టివల్ ఎప్పుడంటే ?
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
సామ్ అదిరిపోయే ఐటమ్ నంబర్ షూటింగ్ ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ప్రారంభమవుతుంది. బాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, బన్నీ, సామ్ కోసం కొన్ని అల్ట్రా మాస్ డ్యాన్స్ మూవ్‌లను కంపోజ్ చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాసిల్, శాండల్‌వుడ్ నటుడు ధనంజయ, సునీల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా బ్యానర్లు సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా రూపొందనున్న ఈ పాన్ ఇండియా చిత్రం డిసెంబర్ 17న థియేటర్లలోకి రానుంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?