Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టి కెరీర్ ను బిజీగా మార్చేసింది. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ లోనూ అమ్మడు నటిస్తోంది. ఇక మరోపక్క వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా కొనసాగుతోంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే సోషల్ మీడియాలో సామ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టినందుకు కూడా అమ్మడు లక్షలు అందుకొంటుంది. ప్రస్తుతం రెండు చేతులా సంపాదిస్తున్న సామ్ ఇటీవల ఫేమస్ సెలబ్రిటీ షో కాఫీ విత్ కరణ్ షో లో సందడి చేసిన విషయం తెల్సిందే. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తో పాటు సామ్ ఈ షో లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఈ షో లో కరణ్ అందరూ అనుకున్నట్లుగానే విడాకుల గురించి మాట్లాడి సామ్ చేత నిజాలు బయట పెట్టించాడు. అలాగే ప్రొఫెషనల్ గా కూడా కొన్ని ప్రశ్నలు అడిగి సామ్ ను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసినా అమ్మడు మాత్రం తెలివిగా సమాధానాలు చెప్పి మెప్పించింది.
ప్రఖ్యాత ఓర్మాక్స్ సంస్థ ఇటీవల చేసిన సర్వేలో టాప్ టాలీవుడ్ హీరోయిన్ గా సమంత నిలిచినా విషయం విదితమే.. అదే విషయాన్నీ కరణ్ ప్రస్తావిస్తూ.. అత్యంత ప్రజాదరణ కలిగిన హీరోయిన్ గా నిలిచారు.. ఇదెలా సాధ్యం అని అడుగగా.. అందుకు సమంత “నిజాయితీగా ఉండాలి.. ఓర్మాక్స్ సంస్థకు లంచం ఇచ్చాను” అని నవ్వేసింది. అయినా ఆగకుండా కరణ్ రెట్టిస్తూ అలియాను ఓడించారు.. అదెలా అనిపిస్తోంది అని అడగగా డబ్బు చెల్లించకపోతే అది సాధ్యమయ్యేది కాదని మరోసారి ఫన్నీగా రిప్లై ఇచ్చింది. అయితే ఇందులో నిజం ఎంత..? అబద్దం ఎంత అనేది పక్కన పెడితే.. అసలు సమంత నోటి నుంచి ఇలాంటి ఒక మాట ఎందుకు వచ్చింది అని అభిమానులు ఆరా తీస్తున్నారు. మరి నిజంగానే సమంత డబ్బులిచ్చి స్టార్ హీరోయిన్ గా మారిందా..? లేదా అనేది తెలియాల్సి ఉంది.