Ram Charan: చరణ్ డాన్స్ కి సమంత ఫిదా.. ఎవరయ్యా ఇలా చేసేది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha Says Ram Charan Dance in Unmatchable in Ra Macha Macha Song: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘గేమ్ చేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘రా మచ్చా మచ్చా..’ సాంగ్‌ను సెయింట్ మార్టిన్స్ కాలేజ్‌లో స్టూడెంట్స్ సమక్షంలో విడుదల చేశారు. ఈ సాంగ్ మాస్ బీట్ తో ఎంతో ఉత్సాహంగా ఉండగా రామ్ చరణ్ కూడా ఒక రేంజ్ లో డాన్స్ చేస్తూ కనిపించాడు. ఆయనతో పాటు ఈ పాటలో వేల మంది డ్యాన్సర్లు, కమెడియన్ సత్య, ప్రియదర్శి లాంటి వాళ్లు కూడా కనిపించారు.
Chandrahass: సినిమా నచ్చకుంటే డబ్బు వాపస్… యాటిట్యూడ్ స్టార్ షాకింగ్ కామెంట్స్
Also Read
- ‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
- Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
- Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
- Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
చాలా రోజుల తర్వాత చరణ్ సోలో స్టెప్పులు చూసే అవకాశం అభిమానులకు దక్కినట్టు అయింది. ఇక అంచనా వేసినట్లే ఈ సాంగ్ ఇన్స్టాంట్ హిట్ గా నిలిచింది. ఈ పాటకు తమన్ మ్యూజిక్ అందించగా అనంత శ్రీరామ్ లిరిక్స్ రాశాడు. ఇక నకాల్ అజీజ్ ఈ పాట పాడగా రామ్ చరణ్ వేసిన స్టెప్పులను కొరియోగ్రాఫ్ చేసింది ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య. ఈ పాటలో చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక ఈ డ్యాన్స్ బాగా నచ్చేయడంతో రామ్ చరణ్ సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో కింద సమంత అన్ మ్యాచబుల్ అని కామెంట్ చేసింది. అంతేకాక అసలు ఫార్మల్ షర్ట్, ప్యాంటు వేసుకున్న ఎవరైనా ఇలా డాన్స్ చేయగలరా? అంటూ ఆమె ప్రశ్నించింది. ఇక తెలుగు సంస్కృతిని చూపించటానికి 1000 మంది జానపద కళకారులతో ఈ పాటను చిత్రీకరించారు.
తాజావార్తలు
-
‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Steve Waugh Praises Vaibhav Sooryavanshi: బ్రాడ్‌మన్, గిల్‌క్రిస్ట్ తర్వాత వైభవ్..? బేబీ బాస్‌పై ఆస్ట్రేలియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
-
Meloni-Trump: ట్రంప్‌తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు
-
Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!