Chandrahass comments at Ram Nagar Bunny Movie Pre Release Event: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “రామ్ నగర్ బన్నీ”. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్న “రామ్ నగర్ బన్నీ” సినిమా అక్టోబర్ 4వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Apple AirPods: ఎయిర్‌పాడ్ ద్వారా చోరీకి గురైన.. రూ.5 కోట్ల విలువైన ఫెరారీ కారు లభ్యం!
ఈ సందర్భంగా హీరో చంద్రహాస్ మాట్లాడుతూ మూడు ప్రామిస్ లు చేస్తున్నా. నేను మాట ఇస్తే తప్పను. నా “రామ్ నగర్ బన్నీ” సినిమా లాభాల్లో 10 శాతం ప్రజలకు ఛారిటీ కోసం ఇచ్చేస్తా. సినిమా చూసి ఆటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ కు నేను అర్హుడిని కాదంటే నా నెక్స్ట్ రెండు సినిమాలకు ఆ పేరు పెట్టుకోను. అలాగే మీరు మా “రామ్ నగర్ బన్నీ” సినిమా చూసి మీకు నచ్చకుంటే నాకు మీ టికెట్ ఫొటోస్ ఇన్ స్టా ద్వారా చెప్పండి మీ డబ్బులు కంపల్సరీ గూగుల్ పే చేస్తా. ఎంతమంది పంపింతే అంతమందికి డబ్బులు రిటర్న్ ఇస్తా. మిమ్మల్ని ఎప్పుడూ ఎంటర్ టైన్ చేస్తూ ఉంటా. “రామ్ నగర్ బన్నీ” సినిమాను నేనంటే నచ్చేవాళ్లతో పాటు నచ్చనివాళ్లు కూడా చూడండి. మీరు నాలో నెగిటివ్ చెబితే నెక్ట్ మూవీకి మార్చుకుంటా. నా ప్రతి మూవీకి నా బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. గత రెండేళ్లలో నా గురించి ఎంతో నెగిటివ్ గా చెప్పారు. నేను అవన్నీ పాజిటివ్ గా తీసుకున్నా. నన్ను విమర్శిస్తే బాధపడను అని అన్నారు.