NTV Telugu Site icon

Samantha Ruth Prabhu: నాకు ఆ అవసరం లేదు.. తేల్చి చెప్పేసిన సమంత

Samantha Remuneration

Samantha Remuneration

Samantha Ruth Prabhu Makes Interesting Comments On Remuneration: నటీనటుల రెమ్యునరేషన్ వ్యవహారంపై కొంతకాలం నుంచి తెగ చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే! ఇక కథానాయికల గురించి ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఒక టాక్ ఉండనే ఉంది. కాస్త క్రేజ్ వస్తే చాలు.. తమ పారితోషికాన్ని అమాంతం పెంచేయడంతో పాటు మరెన్నో డిమాండ్లు పెడుతుంటారని వార్తలు ఉన్నాయి. ఇక స్టార్డమ్ ఉన్న భామలైతే ఆ ఖర్చులు, ఈ డిమాండ్లు అంటూ.. నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంటారని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నటీనటుల పారితోషికంపై సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తన శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా లేటెస్ట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రెమ్యునరేషన్ వ్యవహారంపై ఈ స్టార్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Priyanka Chopra: వాటితో విసిగిపోయా, అందుకే గుడ్‌బై చెప్పా.. ప్రియాంకా షాకింగ్ కామెంట్స్

‘‘నాకు పారితోషికం ఇంత ఇవ్వండి అని అడుక్కోవాల్సిన అవసరం లేదు. నా శ్రమ చూసి స్వయంగా నిర్మాతలే ‘మీకు ఇంత రెమ్యునరేషన్‌ ఇవ్వాలనుకుంటున్నాం’ అని చెప్పాలి. ఇది మనం చేసే కష్టం, కృషి ఆధారంగా వస్తుందని నేనను నమ్ముతాను. మన శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ పోవాలి’’ అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో తన ఆరోగ్యంపై కూడా స్పందించింది. జీవితంలో అన్ని రోజులూ ఒకేలా ఉండవని, ఎత్తుపల్లాలనేవి ఉంటాయని చెప్పింది. తాను అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసి.. తన కోసం నిర్మాతలు, దర్శకులు వెయిట్ చేశారని తెలిపింది. అందుకు తాను వాళ్లకు కృతజ్ఞురాలినై ఉంటానంది. వాళ్లు ఇచ్చిన ధైర్యమే.. తనను తిరిగి సెట్‌లోకి వచ్చేందుకు తీవ్రంగా ఫైట్ చేయాలని కోరుకునేలా చేసిందని స్పష్టం చేసింది. ఇకపోతే.. ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న పాన్ ఇండియా సినిమాగా విడుదల అవుతోంది.

Honey Rose: దాని కోసం ఏం చేయడానికైనా రెడీ.. హనీ రోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Show comments