Honey Rose: దాని కోసం ఏం చేయడానికైనా రెడీ.. హనీ రోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honey Rose Interesting Comments: ‘వీరసింహారెడ్డి’ సినిమా రిలీజైనప్పటి నుంచి హనీ రోజ్ పేరు మార్మోగిపోతోందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. సినిమా ఆఫర్ల సంగతేమో కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఆమెకు విపరీతంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రైవేట్ బ్రాండ్స్ అయితే ఆమె వెనకాలే క్యూ కట్టేశాయని చెప్పుకోవచ్చు. ఏరికోరి మరీ ఆమెను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకుంటున్నారు. రీసెంట్‌గానే ఆమె హైదరాబాద్‌లో ఒక రెస్టారెంట్‌ని ఓపెన్ చేసింది కూడా! నిజానికి.. హనీ రోజ్ 15 ఏళ్ల క్రితమే తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ‘ఆలయం’ మూవీతో ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన ఆ అమ్మడు, ఆ తర్వాత ‘ఈ వర్షం సాక్షిగా’ అనే మరో సినిమా కూడా చేసింది. కానీ, అవి ఆమెకు తగిన గుర్తింపును తీసుకురాలేకపోయాయి. కానీ, ఇన్నేళ్ల తర్వాత చేసిన వీరసింహారెడ్డి మాత్రం ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక అప్పటి నుంచి ఆమె ఏం చేసినా, ఏం చెప్పినా సెన్సేషన్ అవుతోంది. ఇప్పుడు తాజాగా ఆమె పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.
Cruel Daughter: ఒళ్లు గగుర్పొడిచేలా తల్లిదండ్రులను గొడ్డలితో నరికేసింది.. డ్రగ్స్ ఇచ్చి మరీ..
Also Read
సాధారణంగా కథానాయికలు ఒక వయసుకి వచ్చాక.. పెళ్లి గురించి వార్తలు చర్చలు మొదలవుతాయి. హనీ రోజ్‌కి మూడు పదుల వయసు దాటడంతో.. ఆమెకు పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు తరచుగా ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలోనూ పెళ్లి ప్రస్తావన రావడంతో.. ఆమె ఇంట్రెస్టింగ్ జవాబు ఇచ్చింది. పెళ్లి అనేది ఒక పెద్ద బాధ్యత అని, ఆ బాధ్యతని స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపింది. అంటే.. తాను పెళ్లి చేసుకోవడానికి రెడీగానే ఉన్నానని పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసిందన్నమాట! అంతేకాదు.. వివాహబంధం బలంగా ఉండటం కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమేనని స్పష్టం చేసింది. అంటే.. సినిమాలు మానెయ్యడానికి కూడా సిద్ధంగానే ఉన్నట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అదే నిజమైతే.. హనీ రోజ్ అభిమానులు ఏమవుతారో ఏమో? అయితే.. తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలి? అతనిపై తన అంచనాలు ఏంటి? అనే విషయాల్ని మాత్రం హనీ రోజ్ పంచుకోలేదు. అలాగే.. పెళ్లికి రెడీగానే ఉన్నానని చెప్పింది కానీ, ఎప్పుడు చేసుకుంటానన్నది కూడా రివీల్ చేయకుండా సస్పెన్స్‌లో పడేసింది.
Extramarital Affair: మరొకరితో భార్య ఎఫైర్.. భర్తకు తెలిసి ఏం చేశాడో తెలుసా?
తాజావార్తలు
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!